మంగళవారం రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాల్లో ఇద్దరు ఎంఎల్ఏలపైన దాడులు జరగటం విచిత్రంగా ఉంది.  విచిత్రమని ఎందుకు అంటున్నానంటే ఇద్దరు ఎంఎల్ఏలకు రాజధాని అమరావతి తరలింపుకు ఏ విధమైన సంబంధం లేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాలోని పామర్రు ఎంఎల్ఏ కైలే అనీల్ కుమార్ పై ఒకేరోజు దాడులు జరగటమే సంచలనంగా మారింది.

 

పిన్నెల్లి మీద జరిగిన దాడిలో ఆయనకు దెబ్బలు తగల్లేదు కానీ భద్రతా సిబ్బందికి మాత్రం గట్టి దెబ్బలే తగిలాయి.  చిన్నకాకాని దగ్గరున్న కాజా టోల్ గేట్ దగ్గర ఎంఎల్ఏ కారుకు ముందుగా మరో కారును నిలిపి మరీ దాడి జరగటమే హత్యాయత్నానికి ప్లాన్ చేశారనేందుకు ఆధారాలు దొరికాయి. పిన్నెల్లికి రాజధాని అంశంతో సంబంధం లేకపోయినా ప్రత్యర్ధులతో పాత గొడవలు బాగానే ఉన్నాయి.

 

అదే సమయంలో  స్వతహాగా పిన్నెల్లి దూకుడు స్వభావం ఉన్నవాడు. కాబట్టి ఆయనపై దాడి చేస్తే వెంటనే తిరగబడతాడు లేకపోతే భద్రతా సిబ్బందైనా ఎదురు తిరిగి కాల్పులకు దిగితే కొంతమంది చనిపోతారు. కాబట్టి దాన్ని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి రాజధాని తరలింపును అడ్డుకోవచ్చనే వ్యూహం పన్నారంటూ చంద్రబాబునాయుడుపై ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే దాడి సందర్భంగా  పిన్నెల్లి సంయమనం పాటించటంతో కుట్ర బెడిసికొట్టిందంటున్నారు.

 

ఇక పామర్రు ఎంఎల్ఏ అనీల్ కుమార్ పై దాడి ఎందుకు జరిగిందో కూడా అర్ధం కావటం లేదు. పామర్రు నియోజకవర్గంకు కూడా రాజధాని అమరావతి తరలింపుతో ఎటువంటి సంబంధమూ లేదు. పైగా అనీల్ కూడా వివాద రహితుడే కాబట్టి దాడి చేసి కొట్టేంత స్ధాయిలో ప్రత్యర్ధులు కూడా లేరు. అయినా కారును నిలిపి బయటకు వచ్చినపుడు  అదేపనిగా దాడి చేసి కొట్టాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది ?  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరిపైన దాడి చేసినంత మాత్రాన రాజధాని తరలింపు ఆగిపోతుందా ?  మొత్తానికి ఏదో సంచలనం రేకెత్తించేందుకే ఇద్దరు ఎంఎల్ఏలపైనా దాడికి ప్లాన్ జరిగిందనే అనుమానాలు పెరిగిపోతోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: