రోడ్లపై వాహనదారులు  ఎంత స్పీడ్ గా  వెళ్తారో  తెలిసిన విషయమే. రహదారి కొంచెం బాగా ఉంటే చాలు రోడ్డుపై వెళ్లే  వాహనం కూడా కనిపించదు అంత స్పీడుగా వెళుతూ ఉంటారు. ఇక అది  జాతీయ రహదారులు అయితే... స్పీడ్ మీటర్ వందకు దిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో అతివేగం కారణంగా జాతీయ రహదారిపై ఎక్కువగా ఆక్సిడెంట్ లు  జరుగుతూ ఉంటాయి   రహదారులు అతి పెద్ద గా ఉండడం.. ఎక్కువగా మలుపులు లేకుండా ఉండటం వల్ల... జాతీయ రహదారులపై ఎక్కువగా వాహనదారులు స్పీడ్ గా  వెళుతూ ఉంటారు. అయితే వాహనదారుల వేగాన్ని తగ్గించేందుకు అక్కడక్కడ అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ వాహనదారులు వేగం మాత్రం తగ్గదు. అతివేగంతో ప్రమాదాలకు గురవుతు ఉంటారు . 

 

 

 అయితే వాహనదారులు వేగానికి కళ్లెం వేయడానికి అధికారులు జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక జాతీయ రహదారి అంటే వాహనాలు వెళ్లే వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడూ స్పీడ్ బ్రేకర్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని వాహనాలకు జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు వేగానికి కళ్లెం వేస్తుంటే... ఇంకొన్ని వాహనాలకు మాత్రం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు. వాహనాలు ఎక్కువగా స్పీడ్ లో ఉండడం వల్ల స్పీడ్ బ్రేకర్ మీద నుంచి ఎగిరి బోల్తా కొట్టడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. 

 

 

 ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు తొలగించే కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్  అమలులోకి వచ్చిన తర్వాత కూడా టోల్ ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్ లతో వాహనాలు స్లోగా వెళ్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అంతేకాకుండా పలుమార్లు ట్రాఫిక్ జాములు కూడా అవుతున్నాయి. కొంతమంది స్పీడ్ బ్రేకర్లు కారణంగా ట్రాఫిక్ జామ్ అయి ఇంధనం ఎక్కువగా... ఖర్చు అవుతుండడంతో వెంటనే వాటిని తొలగించాలని నిర్ణయించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: