ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిత్యాన్ని తెలిపే హై-పవర్ కమిటీ నిన్న విజయవాడ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. 16 మంది సభ్యులతో కూడిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వం వహించగా మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర ప్రసాద్, కొడాలి నాని, సుచరిత మరియు సురేష్ తో పాటు పలువురు హాజరయ్యారు.

 

అయితే మొదటి రోజున ఒక్క అంశంపైనా వీరు లోతుగా చర్చించకపోగా సభ్యులంతా పరిపాలన వికేంద్రీకరణ మరియు సమగ్ర అభివృద్ధి పై ఒక అవగాహనకు వచ్చారు. అయితే సందర్భంగా వారంతా ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా సభ్యులంతా పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

ఇలా అంతా ఒక మాట మీదకి వచ్చిన తర్వాతనే జిఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదికకు సంబంధించిన ముఖ్యాంశాలు పై చర్చించి ఒక సమీక్ష జరిపారు.

 

తుది నివేదిక సమర్పించడానికి 20 తేదీ వరకు సమయం ఉండడంతో.. ఒక్కో అంశంపై సుదీర్ఘంగా, లోతుగా చర్చించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం 3 రాజధానుల అంశానికి మాత్రమే హై-పవర్ కమిటీ పరిమితం కాదు. రాష్ట్రంలో ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే అంశంపై కూడా కమిటీలు ఇచ్చిన సూచనల్ని అధ్యయనం చేస్తుంది. కేబినెట్ చర్చ అనంతరం కీలక నిర్ణయాల్ని ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: