నిర్భయ పేరు చెప్తే దేశం కళ్ళు చెమర్చుతాయి.  నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఘటన 2012 డిసెంబర్ 16 వ తేదీన జరిగింది.  ఆరోజు రాత్రి జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది.  ఈ దారుణమైన ఘటనతో హోరెత్తింది.  దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేశారు. అత్యాచారం చేసిన నిందితులను అప్పట్లో పోలీసులు పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, నిందితులను శిక్షించడం జరిగింది.  వారికి అప్పట్లోనే ఉరిశిక్ష ఖరారు చేసినా... ఉరి డేట్ ను నిన్నటి వరకు ప్రకటించలేదు.  


ఇందులో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ తరువాత అతడిని రిలీజ్ చేశారు.  అతను ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలు ఎవరికీ తెలియదు.  మరొక వ్యక్తి 2013లోనే తిహాడ్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  మరో నలుగురు నిందితులు జైల్లో ఉన్నారు.  వివిధరకాలుగా ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేశారు.  కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.  సుప్రీం కోర్టు కూడా వీరి పిటిషన్ ను తిరస్కరించింది.  


ఇకపోతే, నిన్నటి రోజున పటియాలా కోర్టు డెత్ వారెంట్ ను రిలీజ్ చేసింది.  డెత్ వారెంట్ ప్రకారం ఈనెల 22 వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది.  దీంతో ఉరికి సంబందించిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.  ఉరిశిక్ష తేదీ ఖరారు కావడంతో.. నిందితులు నరకం అనుభవిస్తున్నారు.  ఈ రెండు వారాలు దోషులకు నరకం కనిపిస్తుంది.  


రెండు వారాల్లో ఇంకా ఎంతగా వాళ్ళు ఇబ్బందులు పడతారో చూడాలి.  ఈ రెండు వారాలు ఆ నలుగురిని వేరు వేరు బారెక్ లో ఉంచారు.  సిసి టీవీలు ఏర్పాటు చేసి వారి మనోభావాలు అలా ఉన్నాయి అనే వాటిని పరిశీలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఆయితే, ఈ 14 రోజులు వాళ్ళను ఎలా చూస్తారు.  వాళ్లకు ఎలాంటి ఫుడ్ పెడతారు.  వాళ్ళను హ్యాపీగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: