ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజు నుండి సీఎం జగన్ ప్రజాసంక్షేమ పాలన కొరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న సీఎం జగన్ బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
ఈ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ చిరు వ్యాపారులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తోపుడుబండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి మరియు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చిరు వ్యాపారులకు, తోపుడు బండ్ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి గుర్తింపు కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
ప్రభుత్వం వీరికి గుర్తింపు కార్డులతో పాటు 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నామని సీఎం జగన్ బ్యాంకర్ల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే దాదాపు 12 లక్షల మంది ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని సమాచారం. సీఎం జగన్ స్వయం సహాయక సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
స్వయం సహాయక సంఘాలు తీసుకునే రుణాలపై 7 జిల్లాలలో 12 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా 6 జిల్లాలలో 7 శాతం వడ్డీగా ఉంది. బ్యాంకర్లను, అధికారులను సీఎం జగన్ ఈ వ్యత్యాసం తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బ్యాంకర్లకు సీఎం జగన్ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచనలు చేసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: