రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా జరుగుతున్నదంతా పెయిడ్ ఉద్యమం అని మొదటి నుండి వైసిపి నేతలంటున్నారు. కాదు జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా  రైతులే స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చారని చంద్రబాబునాయుడు అండ్ కో ఎదురుదాడి చేస్తున్నారు. సరే ఈ వివాదం కంటిన్యు అవుతోందనుకోండి అది వేరే సంగతి. ఇంతలో  సోషల్ మీడియాలో పై ఫొటో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పై ఫొటోలో రెడ్ మార్క్ లోని వ్యక్తికి అసలు రాజధాని ప్రాంతానికి సంబంధమే లేదట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే నెల్లూరు జిల్లాకు చెందిన వాడు. నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలంలోని మాజీ జడ్పిటిసి దామా మహేష్ చౌదరి. ఇతనికి మద్యం వ్యాపారి కూడా ఉందట. తెలుగుదేశంపార్టీలో చాలా యాక్టివ్ గా తిరుగుతుంటారట.

 

పేరులోనే తెలిసిపోతోంది ఇతన ఏ సామాజికవర్గానికి చందిన నేతో.  చంద్రబాబు పిలుపు మేరకు ఉద్యమంలో పాలుపంచుకునేందుకే వచ్చాడో లేకపోతే విరాళాలు ఇచ్చేందుకే వచ్చాడో తెలీదు.  కానీ  రాజధాని ప్రాంతంలోని రైతులతో కలిసిపోయి తాను కూడా  ఓ రైతుగానో లేకపోతే అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో స్ధానికుడిగానో ఆందోళనలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

 

ఇటువంటి మహేష్ చౌదరి లాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారని సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. నిజానికి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల రైతులు భూములిస్తే ఇపుడు ఆందోళనలు జరుగుతున్నది మాత్రం ఓ ఐదారు గ్రామాల్లో మాత్రమే. అందులో కూడా స్వచ్చంధంగా పాల్గొంటున్న వారి సంఖ్య తక్కువేనట. ఉద్యమం నీరుగారిపోతే పరువుపోతుందనే చంద్రబాబు ఇతర ప్రాంతాల వాళ్ళని కూడా పిలిపించి ఉద్యమంలోకి దూర్చేశారట.

 

ఈ విషయం తెలిసే ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటున్నారని అంటున్నది. గట్టిగా వెతికితే మహేష్ చౌదరి లాంటి వాళ్ళు ఉద్యమంలో ఇంకెంతమంది బయటపడతారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: