రాజధాని  అమరావతి  తరలింపుకు వ్యతిరేకంగా ఎంత వసూలు చేశారో తెలుసా ? దీనికి ఎవరు  నాయకత్వం  వహిస్తున్నారో తెలుసా ?  అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా గడచిన 21 రోజులుగా రాజధాని గ్రామాల్లో  ఆందోళన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రైతులు స్వచ్చందంగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అదే సమయంలో జరుగుతున్న ఆందోళనంతా పెయిడ్ ఆందోళనే అని వైసిపి నేతలంటున్నారు.

 

సరే జరుగుతున్నది స్వచ్చందమా ? లేకపోతే పెయిడా ? అన్నది పక్కనపెడితే  రాజధాని పరిధిలోని ఓ ఐదారు గ్రామాల్లో  ఆందోళనలు జరుగుతున్నదైతే వాస్తవమే.  అసలు ఇన్ని రోజులు ఆందోళనలు జరగటానికి అవసరమైన డబ్బు ఎవరు సమకూరుస్తున్నారు ?  ఇక్కడే అసలు విషయం దాగుంది. ఉద్యమం కోసం పెద్ద ఎత్తున విరాళాలివ్వాలంటు చంద్రబాబు పదే పదే బహిరంగంగానే పిలుపిస్తున్న విషయం తెలిసిందే.

 

ఉద్యమ ఖర్చుల పేరుతో  ఇప్పటి వరకూ చంద్రబాబు సుమారు రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు జగన్ మీడియా చెబుతోంది.  ఆందోళనల పేరుతో తాను ఎక్కడ పాల్గొన్నా వెంటనే  విరాళాల సేకరణకు రెడీ అయిపోతున్నారు. ప్రత్యేకంగా హుండీలు కూడా ఏర్పాటు చేశారు. తన భార్య భువనేశ్వరితో  రెండు గాజులు ఇప్పించారు. విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రమ్మోహన్ రావు దీక్ష చేస్తే అక్కడ సుమారు 12 మంది మహిళల నుండి బంగారు గొలుసులు, చెవి దుద్దులు, ఉంగరాలు, చివరకు మంగళసూత్రాలు కూడా తీసుకుంటున్నారు.

 

విరాళంగా వస్తున్న బంగారం కాక క్యాష్ కూడా వసూలు చేస్తున్నారు. అయితే మామూలు జనాలు ఎంతిస్తే ఏమవుతుంది ? అందుకనే పార్టీలోని ప్రముఖులు, తన బినామీలు, రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన ప్రముఖులు,  టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన నేతలతో  కోట్లాది రూపాయలు వసూళ్ళు చేసినట్లు ఆరోపణలున్నాయి.  ఉద్యమం ముసుగులో సుమారు రూ. 100 కోట్లకు పైగా  వసూలైనట్లు సమాచారం. మరి ఇంతమొత్తాన్ని దేనికోసం ? ఎవరి కోసం ? వసూలు చేశారో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: