తిరుమల వెంకటేశ్వర స్వామీ వారి సన్నిధిలో అందరూ సమానమే.  ప్రతి ఒక్కరిని ఆ భగంవంతుడు సమానంగానే చూస్తుంటారు.  కానీ, టీటీడీ దాన్ని కాలరాసి విఐపిలని, వీవీఐపీ లని చెప్పి వేరుగా చూడటం మొదలుపెట్టింది.  వేరుగా చూస్తూనే ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తోంది.  తిరుమల వెంకన్న సాక్షిగా ఇప్పుడు తెరాస నేత, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు అవమానం జరిగింది.  దీనికి కారణం ఎవరూ అంటే కేటీఆర్ అని అంటున్నారు.  


కేటీఆర్ ను ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా చూస్తున్నారు.  త్వరలోనే కేటీఆర్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టిటిడి ఇటీవల తెగ హడావుడి చేసింది.  వైకుంఠ ఏకాదని సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులు శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా అక్కడి అధికారులు కేటీఆర్ కు ముఖ్యమంత్రి ఇచ్చిన స్పెషల్ ఇచ్చి హడావుడి చేశారు.  హరీష్ రావును పెద్దగా పట్టించుకోలేదు.  


దీంతో ఆయన మౌనంగానే ఉన్నారు. పైగా పార్టీలో కేటీఆర్ హవా కొనసాగుతున్నది.  కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కట్టబెట్టి... రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పగ్గాలు అందించే అవకాశం ఉన్నది.  పార్టీ ఇప్పుడు తెలంగాణాలో ఈ స్థాయిలో ఉన్నది అంటే దానికి కారణాం హరీష్ రావు అని చెప్పాలి.  హరీష్ రావు పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతగా కృషి చేసి ఉంటారో చెప్పక్కర్లేదు.  


కెసిఆర్ తనకు స్ఫూర్తి అని, కెసిఆర్ చూపిన మార్గంలో నడుస్తానని చెప్పిన హరీష్ రావుకు తిరుమలలో ఇంతగా అవమానం జరుగుతుందని అనుకోలేదు.  పైగా మంత్రుల్లో సగానికి మందికిపైగా కేటీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు.  దీనిని బట్టి చూస్తే కేటీఆర్ కు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీగాని, కెసిఆర్ గాని హరీష్ రావుకు ఇవ్వడం లేదని అర్ధం అవుతున్నది.  దీనిబట్టి చూస్తే ఫ్యూచర్ లో హరీష్ రావును పక్కన పెడతారేమో అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: