భారదేశంలో పుట్టిన వారు ఎక్కడేక్కడి దేశాల్లో ఉంటూ భరతమాత కీర్తి ప్రతిష్టలును పెంచేవిధంగా తమ జీవితాలను మలుచు కుంటున్నారు. ఇప్పటికే పలువురు భారతీయులు విదేశాల్లో కీలకపదవుల్లో ఉన్నారన్న విషయం తెలిసిందే. భరతమాత కీర్తిని నలుదిశలు వ్యాపించేలా చేయడంలో ఎన్నారైలు ప్రముఖపాత్ర పోషిస్తున్నారనడంలో సందేహం లేదు. ఇక మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లుతున్నారనడంలో సందేహం లేదు. అందుకు ఉదాహరణలుగా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చూ.

 

 

ఇకపోతే తాజాగా భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు న్యూయార్క్‌ పరిధిలోని కోర్టు న్యాయ మూర్తులుగా నియమితులయ్యారు. అందులో సివిల్‌ కోర్టు తాత్కాలిక జడ్జిగా,  2019 జనవరిలో  పని చేసిన అర్చనారావు ఒకరు కాగా.. 2018లో తొలిసారి సిటీ సివిల్‌ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా సేవలందించిన దీపా అంబేకర్‌ మరొకరు.. ఇందులో న్యూయార్క్‌ క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనారావు, సివిల్‌ కోర్టు జడ్జిగా దీపా అంబేకర్‌ను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో నియమించారు.

 

 

ఇక అర్చనారావు ఫొర్ధాం యూనివర్సిటీ న్యాయ కళాశాలలో నుంచి జ్యురిష్‌ డాక్టర్‌ డిగ్రీ అందుకోగా, దీపా అంబేకర్‌ రుట్గర్స్‌ న్యాయ కళాశాల నుంచి జ్యురిస్‌ డాక్టర్‌ డిగ్రీ అందుకున్నారు. ఇదిలా ఉండగా అర్చనా రావు 2019 జనవరిలో సివిల్ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులవ్వకముందు, న్యూయార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో 17 సంవత్సరాలు పనిచేశారు. ఇటీవల బ్యూరో చీఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌గాను వ్యవహరించారు.

 

 

ఇకపోతే దీపా అంబేకర్ విషయానికి వస్తే. ఆమె 2018 మేలో సివిల్ కోర్టు తాత్కాలిక జడ్జిగా నియమితులవక ముందు, న్యూయార్క్ సిటి కౌన్సిల్‌ సీనియర్ లెజిస్లేటివ్ అటార్నీగా, పబ్లిక్ సేఫ్టీ కమిటీకి న్యాయవాదిగా పనిచేశారు. అంతేకాకుండా క్రిమినల్ డిఫెన్స్ డివిజన్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీలో స్టాఫ్ అటార్నీగానూ వ్యవహరించారు.. సమాజంలో మహిళలను చిన్న చూపు చూసేవారికి ఇలాంటి మహిళలు చూసైన కనువిప్పు కలగాలంటున్నారు కొందరు పెద్దలు..

మరింత సమాచారం తెలుసుకోండి: