గత కొంతకాలంగా దేశంలో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి.  ఉల్లి కోసం ఎన్ని గొడవలు జరిగాయో చెప్పక్కర్లేదు.  ఉల్లి ధరలను తగ్గించాలని చెప్పి నిరసనలు చేశారు.  ఆందోళనలు చేశారు.  రోడ్డుపైకి జనాలు వచ్చి ఉల్లి బొమ్మతో లాంగ్ మార్చ్ లు చేశారు.  ఉల్లి ప్రభుత్వాలను కూల్చి వేస్తాయేమో అనుకున్నారు.  కానీ, రూ. 20 ఉండే ఉల్లి ఏకంగా కేజీ రూ. 200 లకు పైగా చేరడంతో భయపడ్డారు.  


కానీ, ఉల్లికి ఎలాంటి ఇబ్బందులు రావని ఎంతగా ప్రభుత్వాలు చెప్తున్నా, ఉల్లి ధరలు మాత్రం ఆగడం లేదు.  రూ. 200 పైగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో కొంతవరకు ఇబ్బందులు తొలిగిపోయాయి. అయితే, ఉన్న ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.  ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధం అయ్యింది.  టర్కీ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంది.  


తరువాత ఇప్పుడు టర్కీతో పాటుగా ఆఫ్గనిస్తాన్ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది ఇండియా.  ఈ నెలాఖరు వరకు దాదాపుగా 36000 టన్నుల ఉల్లి ఇండియాకు రాబోతున్నది.  ఈ ఉల్లి ఇండియాకు వస్తే ఉల్లి ధరలు దిగివస్తాయి.  ఇప్పటికే 1000 టన్నుల ఉల్లిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు పంపిణి చేశారు.  ఇంకా అవసరం అనుకుంటే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది.  


ఉల్లి ధరలు ఇప్పటి వరకు అందుబాటులోనే ఉన్నాయని కేంద్రం చెప్తున్నది.  ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా రూ. 100 నుంచి రూ. 118 వరకు పలుకుతుంది.  ఢిల్లీ లో రూ. 70 వరకు ఉన్నది.  ఖరీఫ్ సీజన్ లో దేశంలో 25శాతం వరకు ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి.  ఉల్లి ధరలు దిగివస్తున్న సమయంలో ఇప్పుడు మిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఉల్లితో పాటుగా కోడి ధరలు కేసుల ఆకాశాన్ని తాకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు వినియోగదారులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: