గత కొన్ని వారాలుగా రాజధాని.. అమరావతిలోనే కొనసాగించాలని అనేక మంది రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి విధితమే. గతంలో వైసీపీ.. రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పడంతోనే 29 గ్రామాల రైతులు భూములను ఇచ్చారని.. కానీ ఇప్పుడు రాజధాని అమరావతిలో కాకుండా వేరే చోటుకు తరలిస్తున్నారని 21 రోజులుగా రైతులు నిరసన చేపడుతున్న విషయం విదితమే. అయితే ఈ ఆందోళనలో చంద్రబాబుతో సహా టీడీపీ పార్టీ నేతలు మద్దతిస్తూ పాల్గొంటున్నారు.


నిన్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో ఒక దీక్షను చేపట్టారు. ఆ దీక్షకు చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు. అయితే ఈ దీక్ష వేదికలో రాజధాని రైతులకు మద్దతు పలికేందుకు వచ్చిన ఒక సామాన్య మహిళ మాట్లాడుతూ.. నాకు మూడు రోజుల నుంచి చాలా బాధగా ఉంది. నేను ఉన్నపలంగా ఎలా ఉన్నానో అలానే వచ్చేసా. చంద్రబాబు నాయుడిని ఒకటే కోరుతున్నాను. నేను ఇక్కడికి నా భర్తకు చెప్పకుండా వచ్చేశాను. నేను మా భర్త పర్మిషన్ తీసుకోలేదు. చంద్రబాబునాయుడు గారు నాకు ఒక సహాయం చేయాలి. మా వారి పేరు చంద్రశేఖర్. అనుమతి లేకుండా ఒక లేడీ బయటకు రావాలంటే చాలా కష్టమైన విషయం. మీరు మా వారికి నా తరఫున ఫోన్ చేసి ఏమని అనవద్దని చెప్పండి.' అని మాట్లాడింది.


దాంతో అక్కడ కోలాహలంగా మారింది. చంద్రబాబు మాట్లాడుతూ... ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు.


ఆ తరువాత.. 'హలో, హలో... నమస్కారం బ్రదర్! నీ పేరు ఏంటమ్మా? నేను చంద్రబాబునాయుడిని. ఇక్కడ మేము ఒక మీటింగ్ లో ఉన్నాం. నాగలక్ష్మి గారు వచ్చారు. మీ పర్మిషన్ లేకుండా వచ్చారు. వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. తన భర్త పర్మిషన్ లేకుండా ఇంతవరకు తాను ఎప్పుడూ గడపదాటలేదని చెబుతూ మొదటి సారి చాలా ఎమోషన్ తో వచ్చేశారు. ఒక ఉంగరం కూడా ఉద్యమానికి సహాయంగా ఇచ్చేశారు. మీరు కూడా ఆమె మనసు పూర్తిగా ఆశీర్వదించాలి సహకరించాలి', అని ఫోన్లో మాట్లాడారు. అలాగే ఆమె భర్త చంద్రశేఖర్ ని గట్టిగా మాట్లాడమని చంద్రబాబు కోరగా.. తను మాట్లాడుతూ.. నా భార్య లాగానే ఆడబిడ్డలు అందరూ వచ్చి రైతులకు రైతులకు మద్దతు ఇవ్వాలని ఆశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: