ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం మూడు రాజధానులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి లో రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు రైతు కుటుంబం మొత్తం రోడ్ల పైకి చేరి నిరసనలు ధర్నాలు ఆందోళనలు చేపడుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేస్తే ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిపోతుంది అంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. 

 

 

 ఇక అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతులు విద్యార్థి సంఘాలు అన్నింటికీ ప్రతిపక్ష టిడిపి పార్టీ మద్దతు తెలుపుతుంది. ప్రస్తుతం అమరావతి ప్రజలందరికీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని అమరావతి నుండి రాజధాని తరలిస్తే యువత ఆందోళనలు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని అంటే  ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అంతేకాకుండా అమరావతిలోని గ్రామాలన్నీ తిరుగుతూ... చంద్రబాబు నాయుడు రైతుల నిరసన లకు మద్దతు ప్రకటిస్తున్నారు. 

 

 

 ఇకపోతే రాజధాని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం చెబితే యువత ఆందోళనలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇవ్వడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. అమరావతిని రక్షించుకో లేకపోతే చనిపోయినట్లట... రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చెయ్యాలట... మీ బినామీలు సొంత మనుషులు ఆస్తుల విలువలు తగ్గకుండా కాపాడటాడానికి ప్రజలంతా సమిధలు కావాలా... నీలాంటి స్వార్థపరుడు ప్రతిపక్షనేతగా ఉండడం కర్మ కాకపోతే మరి ఏంటి అని విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: