చిన్నకాకానికి సమీపంలోని కాజా టోల్ ప్లాజా దగ్గర మాచర్ల ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై జరిగిన దాడి ప్లాన్ చేసింది వైసిపి నేతేట. అదికూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన జగన్ షరాఫ్ చేయించినట్లు తెలుగుదేశంపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ షరాఫ్ ది పులివెందులట. షరాఫ్ ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడట. పిన్నెల్లిపై దాడి జరిగినపుడు షరాఫ్ కూడా అక్కడే ఉన్నాడట. కాబట్టి  షరాఫే దాడి చేయించినట్లు  టిడిపి తేల్చేసింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపి ఎంఎల్ఏపై వైసిపి నేతలే ఎందుకు దాడి చేయించుకుంటారు ? పైగా పులివెందులలో సిఎంకు సన్నిహితుడితో దాడి చేయించాల్సిన అవసరం ఏమిటి ? పులివెందుల వ్యక్తే ఎంఎల్ఏపై దాడి చేయించారని టిడిపి నేతలు చెప్పటంలో దాడిని ముఖ్యమంత్రే చేయించాడని చెప్పటమేనా ?  అసలు పిన్నెల్లిపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంది ?

 

ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం ఎంఎల్ఏకి రాజధాని తరలింపుకు ఎటువంటి సంబంధం లేదు. రాజధాని తరలింపు నిర్ణయం స్వయంగా జగన్మోహన్ రెడ్డిదే.  సిఎం స్ధాయిలో తీసుకున్న నిర్ణయానికి, ఎంఎల్ఏకి ఎటువంటి లింకు లేదని అందరికీ అర్ధమవుతోంది. అయినా పిన్నెల్లిపై దాడి జరిగిందంటే ఏమిటర్ధం ? పైగా దాడి జరిగినపుడు  పులివెందులకు చెందిన షరాఫ్ అక్కడే ఉన్నట్లు ఆరోపిస్తున్నారంటే అర్ధమేంటి ?

 

ఇక స్వయంగా పిన్నెల్లే తనపై దాడి చేయించింది చంద్రబాబునాయుడే అని ఆరోపిస్తున్నారు. తనపై జరిగిన దాడికి రైతులకు ఎటువంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. నేషనల్ హై వే పై ఆందోళనకారులు ఉన్నారు కాబట్టే తాను పక్కనే ఉన్న సర్వీసు రోడ్డులో వెళ్ళినట్లు చెప్పారు. అయితే ఎల్లోమీడియా మాత్రం ఎంఎల్ఏ సర్వీసు రోడ్డున్నా కావాలనే ఎంఎల్ఏ నేషనల్ హై వే పైనే వచ్చినట్లు చెప్పింది.

 

అదే సమయంలో కారును ఆపిన ఎంఎల్ఏ ఓ విలేకరిని పిలిచి మాట్లాడారని చెప్పింది. విలేకరితో ఎంఎల్ఏ పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఏమిటంటూ సందేహం వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది.  అసలీ గొడవంతా పిన్నెల్లి గన్ మెన్ ఓ రైతును తోసేయటంతో మొదలైనట్లు కూడా తీర్పిచ్చేసింది. అంటే గొడవకు కారణం ఎంఎల్ఏనే అని చెప్పటమే ఎల్లోమీడియా ఉద్దేశ్యంగా స్పష్టమవుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: