పశ్చిమాసియా దేశాల్లో మేఘాలు కమ్ముకుంటున్నాయి.  ఆ మేఘాల్లోగుండా ఎప్పుడు బాంబులు వచ్చిపడతాయేమో అని భయపడిపోతున్నారు.  కొన్నాళ్లక్రితం ఇరాక్ పై అమెరికా యుద్ధం చేసి సద్దాం హుస్సెన్స్ ను పట్టుకుంది.  అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా సద్దాం ను బహిరంగంగా అది తీయించింది.  కాగా, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అలానే చేయాలనీ చూస్తోంది అమెరికా.  కానీ, అమెరికాకు తెలియని విషయం ఏమిటంటే ఇరాన్ అంత తెలివి తక్కువదేమి కాదు.  


పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ బలమైన దేశం.  ఆర్ధికంగా, సాంకేతికంగా, యుద్ధ పరంగా అన్ని రకాలుగా ఆ దేశం అభివృద్ధి చెందింది.  అందుకే ఇరాన్ విషయంలో అమెరికా ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరిస్తోంది.  కానీ, ట్రంప్ మాత్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  ఇరాన్ తో యుద్ధమే శరణ్యం అనేలా చేస్తున్నాడు.  ఇరాక్ కూడా అమెరికాకు దూరం అవుతుండటంతో అమెరికా తట్టుకోలేకపోతున్నది.  పశ్చిమాసియాలో బలంగా ఎదగాలని చూస్తున్న అమెరికాకు ఇరాక్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో అమెరికా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నది.  


ఎందుకంటే అమెరికా ఇరాక్ కు సపోర్ట్ గా ఉండటమే కాకుండా ఇరాక్ లో ఎయిర్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది.  సైనికుల రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది.  అమెరికా సైన్యం స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వలన అక్కడ ఆ ప్రాంతాలను తమ ఆధీనంలో  తీసుకున్నట్టుగా అవుతుంది.  అయితే, ఆర్ధికంగానే కాకుండా, రాజకీయంగా కూడా బలహీన పడింది.  అంతర్గత యుద్దాల కారణంగా ఇరాక్ ఆర్ధికంగా నష్టపోయింది.  కావాల్సినంత చమురు నిల్వలు ఉన్నా, కేవలం అంతర్గత యుద్ధాల కారణంగానే చితికిపోయింది.  


ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే, దాని వలన చాలా దేశాలు నష్టపోయే అవకాశం ఉన్నది.  ముఖ్యంగా ఇండియా వంటి దేశాలకు మహా ఇబ్బంది అవుతుంది.  ఇండియాకు చమురు దిగుమతి తగ్గిపోతుంది.  ఫలితంగా ఇండియాలో చమురు ఉత్పత్తులపై భారం పడుతుంది.  ఒక్క చమురు ఉత్పత్తులపైనే కాదు, దానితో సంబంధం ఉన్న ప్రతి రంగంపైనా అదనపు భారం పడే అవకాశం ఉంటుంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం మరో యుద్దాన్ని మోయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: