అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ పాల్పడిన భారీ కుంభకోణం ఇపుడు బయటపడిందా ? కేశవరెడ్డి విద్యాసంస్ధల సొసైటి ఛైర్మన్ మదుసూధన్ రెడ్డి  చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఆశ్చర్యంగా ఉంది.  కేశవరెడ్డి విద్యాసంస్ధల కుంభకోణం గురించి అందరికీ తెలిసిందే. అదేనండి టిడిపి ప్రభుత్వంలో ఉన్నపుడు కేశవరెడ్డి తన విద్యసంస్ధల్లోని తల్లి దండ్రుల నుండి సుమారు రూ. 700 కోట్లు వసూలు చేశారు.  ఆ తర్వాత ఆ మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేశారు.

 

అప్పట్లో కేశవరెడ్డి విద్యసంస్ధలో బయటపడిన  కుంభకోణం పెద్ద సంచలనమైంది.  ఇంతకీ విషయం ఏమిటంటే ఆ కుంభకోణం కీలక పాత్రదారుల్లో నారా లోకేష్ కూడా ఒకరట. అప్పటి వరకూ వైసిపి ఎంఎల్ఏగా ఉన్న ఆది నారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరింది కూడా కేశవరెడ్డిని రక్షించుకోవటానికే అని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఆది నారాయణరెడ్డి, కేశవరెడ్డి ఇద్దరూ వియ్యంకులు లేండి అందుకనే ఆది పార్టీ ఫిరాయించారట.

 

ఇపుడీ విషయాలన్నింటిని కేశవరెడ్డి విద్యాసంస్ధల ఛైర్మన్ మదుసూధన్ రెడ్డి బయటపెట్టారు.  వివిధ మార్గాల్లో  కేశవరెడ్డి రూ. 700 కోట్లు సేకరించారు. ఆ మొత్తంతో భారీ ఎత్తున భూములు, భవనాలపై పెట్టుబడిగా పెట్టారు. తర్వాత కర్మకాలి అరెస్టయ్యారు. అయితే వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించటానికి ఏమాత్రం ఇష్టపడలేదు.

 

అడ్డదిడ్డంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే లోకేష్ తో ఆది ఒప్పందం చేసుకున్నట్లు ప్రస్తుత ఛైర్మన్ చెప్పారు. అక్రమాస్తులను కాపాడినందుకు లోకేష్ కు విజయవాడ సమీపంలో నాలుగున్న ఎకరాల స్ధలాన్ని రాసిచ్చేశారట. అలాగే అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రూ. 5 కోట్లు చెల్లించారని ఛైర్మన్ చెప్పటం సంచలనంగా మారింది.  సంస్ధ పేరుతో ఉన్న ఆస్తులను అమ్మేసి అప్పులు తీర్చేద్దామని తాను చెప్పినా ఆది నారాయణరెడ్డి వినటం లేదన్నారు. పైగా తననే బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఛైర్మన్ చెప్పటం కలకలం రేగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: