ఈ మధ్యాకాలంలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. కొంతమంది ఆత్మహత్యలకు అసలు వీళ్లకు బుద్ధి ఉందా..? అని అనిపిస్తుంది.. మొన్నటికి మొన్న ఓ మహిళా తన చంటి బిడ్డ ఆలనా పాలనా చూడలేక.. పిల్లడు పదేపదే ఏడుస్తున్నాడు అని.. 9వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లి. 

               

తల్లి అంటేనే పిల్లలను చూసుకునేది.. అలాంటి తల్లే బిడ్డ ఏడుపు భరించలేక ఆత్మహత్య చేసుకుంది అంటే ఏంటి సంగతి.. సరే.. ఆమె సంగతి పక్కన పెడుదాం.. నిన్నటికి నిన్న ఓ 18 ఏళ్ళ కుర్రాడు.. బట్టతలా వస్తుంది అని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఈ కారణం వింటే.. ఏంటి అని ఆశ్చర్యపోయిన.. ఇంత పిచ్చోడు ఏంటి అని నవ్వొస్తుంది. ఆలా ఉంది ఆ బట్టతల అనే కారణం. 

            

ఈరోజు.. ఓ మహిళ హరియాణా గురుగ్రామ్‌ నుండి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తుంది. కొండాపుర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక అనే 25 ఏళ్ళ యువతి నివాసముంటోంది. 

 

హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఏమైందో తెలియదు కానీ మౌనిక మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా.. హర్యాణ నుండి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: