గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కెసిఆర్ కేశవ రెడ్డి  విద్యాసంస్థలు చేసిన మోసానికి కర్నూలు జిల్లాలో ఆ సంస్థలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ తేరుకోలేక పోతున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును ఊహించుకుని జిల్లావ్యాప్తంగా కేశవ రెడ్డి స్కూల్ లో పిల్లలను చేర్పించారు. ఈ సందర్భంగా పిల్లల చదువు నిమిత్తం లక్ష రూపాయల నుంచి డిపాజిట్ల్ సేకరించారు. ఆ సొమ్ముతో కేశవరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక విద్యా సంస్థలను నెలకొల్పారు. అయితే తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డిపాజిట్లు మెచ్యూరిటీ టైం అయిపోయినా తిరిగి చెల్లించకుండా తిప్పుతూ ఉండడంతో మోసపోయామనే విషయాన్ని వారంతా గ్రహించడం, ఆ తరువాత ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ? కేశవరెడ్డి కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రమేయం ఉన్నట్టు ఇప్పుడే ఆధారాలతో బయటపడింది. ఈ మేరకు కేశవ రెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నం చేద్దామని చెబుతున్నా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయన బంధువులు తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీ కలిసి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.  కేశవరెడ్డి తన విద్యాసంస్థల పేరుతో సుమారు 700 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి వాటిని తిరిగి చెల్లించలేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం లో అప్పుడు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కేశవ రెడ్డికి అండగా నిలబడ్డారు.


ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులుగా ఇప్పుడు నారా లోకేష్, ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నట్టుగా మధుసూదన్ రెడ్డి చెబుతున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తన ఆస్తులను కాపాడుకునేందుకు ఆదినారాయణరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లారు అంటూ మధుసూదన్ రెడ్డి బయటపెట్టారు. డిపాజిట్లు చెల్లించకుండా ఆస్తులను కాపాడుకునేందుకే టిడిపి పెద్దలతో ఆయన ఒప్పందం చేసుకున్నారని, దీనిలో భాగంగానే నారా లోకేష్ కు విజయవాడ సమీపంలో అత్యంత విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని అప్పగించినట్లు మధుసూదన్ రెడ్డి బయటపెట్టారు. ఆయనే కాకుండా అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఐదు కోట్లు ఇచ్చినట్లు బయటపెట్టారు. 


అలాగే కేశవ రెడ్డి విద్యాసంస్థల సొసైటీలో కి నారా లోకేష్ కు చెందిన బినామీలను చేర్చుకోవాలంటూ తనపై ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని, ప్రస్తుతం వారందరి నుంచి నాకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో నారా లోకేష్ జోక్యం ఉండనే విషయం బయటపడడంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: