ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో రాజధాని సెగలు ఓ స్థాయిలో జరుగుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానులు ఉండొచ్చని చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనమైంది. అప్పటి నుంచీ అమరావతి ప్రాంత రైతుల సంగతేమో కానీ కొన్ని రాజకీయ పక్షాలకు మాత్రం ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు. రాజధానిగా రాష్ట్రానికి ఆ చివరనున్న విశాఖను ఎలా ఎంచుకుంటారని, అమరావతి ప్రాంత రైతుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అమరావతి ప్రాంత రైతుల గురించే మాట్లాడుతున్నారు కానీ.. ఉత్తరాంధ్రలో రాజధాని ఇష్టమా కాదా అనే వైసీపీ నాయకులు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పటం లేదు.

 

 

ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో తప్పు లేదు. కానీ.. కొందరు విశాఖను బూతద్ధంలో చూపించి విపరీతమైన వార్తలు రాస్తున్నారు. అంత దూరం.. ఇంత దూరం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిజానికి చెన్నై, బెంగళూరు నగరాలు ఆ రాష్ట్రాల్లో ఓ మూలకే ఉన్నాయన్న సంగతి మరచిపోతున్నాయనే చెప్పాలి. చెన్నై మన ఆంధ్రాకు దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి కన్యాకుమారికి దాదాపు 700 కిలోమీటర్లు ఉంటుంది. మరి కన్యాకుమారి ప్రాంతం వారు ఎంత గొడవ చేయాలి. గుల్బర్గా నుంచి బెంగళూరుకు 600 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. వాళ్లు కూడా రాజధానికి దూరంగానే ఉన్నారు. ఇవన్నీ మరచి కొందరు అవాస్తవాలను ప్రజల్లో బలంగా రుద్దుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

 

 

ప్రజల్లో కొందరిపై ఉన్న అనుమానాలను కొందరు రాసే వార్తలు బలపరుస్తున్నాయి. వాస్తవాలను పక్కదారి పట్టించటం ఎవరికీ తగదు. నిజమైన సమస్యలను ప్రజలకు నిస్వార్ధంగా అందిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఏకపక్షంగా రాసే వార్తలను ప్రజలు నమ్ముతారని భావించడం కూడా అమాయకత్వమే. అదే జరిగితే ప్రజా తీర్పులు వేరే విధంగా ఉండేవన్న సంగతి గుర్తెరగాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: