పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారనే ముద్ర ఆయన మీద బలంగా పడిపోయింది. మొదటగా ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లడం, మూడు నాలుగు రోజులు హడావుడి చేయడం, ఆ తరువాత పవన్ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం ఇవన్నీ గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అసలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేయలేకపోతున్నారు అనే విమర్శలు సొంత పార్టీ నాయకులు, అభిమానులు నుంచే వ్యక్తం అవుతోంది.

 

తాజాగా అమరావతి విషయంలోనూ పవన్ అదే విధంగా ముందుకు వచ్చారు. జగన్ తీసుకున్న నిర్ణయం అవివేకం, అన్యాయం అంటూ హడావుడి చేశారు. నేల మీద కూర్చుని మరి రైతులకు మద్దతుగా ఉద్యమం చేపట్టారు. అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాలను సందర్శించి మీ వెనుక నేను ఉన్నాను భయపడకుండా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం అంటూ హడావుడి చేశారు.


 ఈ పరిణామాలు జనసేన కు మంచి ఊపు తెచ్చాయి. అలాగే అమరావతి ప్రాంతంలో కూడా జనసేనపై సానుకూల దృక్పధం ఏర్పడేలా చేస్తాయి. కానీ అకస్మాత్తుగా పవన్ ఈ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నట్టుగా కనిపించారు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా పవన్ ఆ దరిదాపులకు కూడా వచ్చేందుకు ముందడుగు వేయడం లేదు. నిన్న ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. గతంలో పవన్ చేసిన రాజకీయ పోరాటాలను పరిగణలోకి తీసుకుంటే అన్నిటినీ మధ్యలోనే వదిలేసి వెళ్లారు. 


ముందు ముందు కూడా ఇదే ధోరణి తో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే రాజకీయంగా జనసేన ఎదిగే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది అనే సూచనలు వస్తున్నాయి. పవన్ లో మార్పు ఎప్పుడు వస్తుందో తనపై పడ్డ ముద్రను ఎప్పుడు చెరుపుకుంటారో అని జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: