అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణతో పశ్చిమాసియాలో తెలియని భయం అలుముకుంది.  చమురు ఉత్పత్తులపై ఆధిపత్యం కోసం అమెరికా ఎత్తులు వేస్తోంది.  ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న అమెరికా ఎత్తుగడలు ఇరాన్ పై సాగుతాయా అన్నది తెలియాలి.  పశ్చిమాసియాలో ఇరాన్ కు ఒకప్పుడు ఇరాక్ శతృదేశం.  ఈ దేశానికి అమెరికా దగ్గరైంది.  ఆ దేశంలోని నియంతను పట్టుకొని బహిరంగంగా ఉరి తీయించింది.  దీంతో అక్కడ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను అధినేత నియమించింది.  


కానీ, ఇప్పుడు అమెరికా పప్పులు ఉడకడం లేదు.  ఇరాక్ కూడా అమెరికాకు వ్యతిరేకం అవుతున్నది.  ప్రశాంతమైన జీవనానికి అమెరికా అడ్డు వస్తోందని తెలుసుకున్న ఇరాక్, తమ దేశం నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాలని ఆదేశించింది.  అందుకు అమెరికా ఒప్పుకోలేదు.  పైగా మరో పదివేలమంది అమెరికన్ సైన్యాన్ని రంగంలోకి దించేందుకు సిద్ధం అవుతున్నది.  ఇదే సమయంలో ఇరాన్ కు చెందిన ఆర్మీ సుప్రీం కమాండర్ సులేమానిని అమెరికా డ్రోన్స్ తో అంతం చేశారు.  


ఇది ఇరాన్ కు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది.  దెబ్బకు దెబ్బ కొడతామని ప్రకటించింది.  కానీ, ఈ దెబ్బ ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియజేసింది.  ఇందులో భాగంగానే సులేమాని అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఇరాన్ డజన్ల కొద్దీ మిస్సైల్స్ ను ఇరాక్ లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ మీదకు ప్రయోగించింది.  ఈ మిస్సైల్స్ దాడిలో 80 మంది అమెరికన్ సైన్యం మరణించినట్టుగా సమాచారం.  అంతేకాదు, హెలికాఫ్టర్లతో పాటుగా మరికొన్ని ధ్వంసం అయినట్టు సమాచారం.  


ప్రస్తుతానికి అంతా బాగుందని, ఈ ఇరాన్ దాడిలో ఏం జరిగింది అనే విషయాలు కొద్దిగంటల్లోనే ప్రకటిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.  ఇక ఇండియాలో పెట్రోల్ రేట్లు పరిగిపోయే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీలైనంతగా పెట్రోల్ పెట్టుకొని ఉంచుకోవడం ఉత్తమం.  లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  పెట్రోల్ తో పాటుగా ఇంకా కొన్ని వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: