2012వ సంవత్సరంలో నిర్భయపై జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ ఘటన జరిగి 7ఏళ్లు గడిచిన తరువాత అనగా నిన్న జనవరి 7న ఈ దోషులకు ఢిల్లీ సెషన్స్ కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసింది. దీంతో, నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా మరొకవైపు రేపిస్టుల తల్లిదండ్రులు కన్నిమున్నీరయ్యారు.


నిన్న ఢిల్లీ సెషన్ కోర్టులో తీర్పును ఇస్తుండగా ఆ కోర్టు మొత్తం నిర్భయ బంధువులతో నిర్భయ బంధువులతో, ఇంకా రేపిస్టుల తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. అడిషనల్​ సెషన్స్​ జడ్జి సతీశ్​కుమార్​ అరోరా.. నిర్భయ దోషులకు ముకేశ్(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ(26), అక్షయ్​ కుమార్​సింగ్(31)లకు డెత్​ వారెంట్ జారీ చేస్తున్నట్లు ప్రకటిస్తుండగా ముకేశ్ తల్లి బోరున విలపించినట్లు సమాచారం. అలాగే రేపిస్టులు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది.


నిందితుడు ముకేశ్ తల్లి రోదిస్తూ.. 'నా కుమారుడికి క్షమాభిక్ష పెట్టండి. ముఖేష్ మీద దయ చూపండి.' అంటు గట్టిగా మొత్తుకుంటూ ఏడ్చింది. కానీ న్యాయస్థానం ఆమె కోరికలను తోసిపుచ్చింది. దాంతో ఇక న్యాయస్థానంలో తన మాటలు ఎవరు వినరని భావించిన ఆ ముఖేష్ తల్లి.. వెంటనే కోర్టు నుంచి బయటకు వెళ్తున్నా నిర్భయ తల్లి ఆశా దేవి చీర కొంగు పట్టుకొని.. ' అమ్మ. నా కొడుకుని క్షమించమ్మా. నా కొడుకుకి ప్రాణం బిక్ష పెట్టమ్మా. అతని ప్రాణాల కోసం నేను ఎంతో ప్రాధేయ పడుతున్నాను. నా కొడుకుపై దయ, జాలి చూపించమ్మా', అంటూ రోదిస్తూ అడిగింది.


అప్పుడు నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడుతూ..' నాకు ఒక కూతురు ఉండేది. నా బిడ్డకు జరిగిన అఘాయిత్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ క్షణం కోసమే, (నా బిడ్డకు జస్టిస్ కోసం) నేను గత ఏడేళ్లుగా ఎంతో ఎదురుచూస్తున్నా.' అని ఆమెకు సమాధానం చెప్పింది.


అయితే, జనవరి 22వరకు ఉరిశిక్ష అమలు కాదు కాబట్టి ఈ సమయంలో దోషుల తల్లిదండ్రులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. దాంతో ముకేశ్, వినయ్ తరఫున లాయర్లు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ను దాఖలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, మీడియా ముందుకు వచ్చిన ముకేశ్ తల్లి తన కుమారుడు అసలు నేరమే చేయలేదని.. పేదవాళ్ళమన్న ఆసరాతో నా కుమారుడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తుంది. మరి 22న వీళ్లకు మరణశిక్ష పడుతుందో లేదో చుడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: