ఒక్కోసారి ఆడే సరసాలు సీరియస్‌గా మారి గొడవలకు దారితీస్తాయి.  ఇవే కాకుండా నవ్వుకుంటు చేసుకునే పరాచకాలు కూడా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లుతాయి. అందుకే అంటారు నలుగురిలో ఉన్నప్పుడు మాటలకు అదుపు ఉండాలని. ఇకపోతే పెళ్లి అంటే వినోదాల సంబరం. కొన్ని కొన్ని పెళ్లిల్లో ఆనందం, సంతోషం ఎంతలా కనబడుతాయంటే, ఇంకా కొన్ని రోజులపాటు ఇలాంటి వేడుక జరిగితే బాగుండు అని అనిపిస్తుంది. మరికొన్ని పెళ్లిలైతే ఎప్పుడు శుభకార్యం ముగుస్తుందా  తొందరగా ఇక్కడి నుండి బయటపడుదామా అనేలా బోర్‌గా సాగుతాయి.

 

 

ఇక పెళ్లి అంటేనే నవ్వులకు వేడుక కాని ఆనవ్వులు విసిగిస్తే దాని తాలుకూ ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడొక వెళ్లి కొడుకు చూపించాడు. ఆనందంగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుకను రణరంగం చేసి జోకులు చేస్తున్న యువకుడు మూతి పగల గొట్టాడు. పెళ్లి కూతురు వారిస్తున్న వినకుండా ఆవేశంగా పైకి లేచి మెడలోని పెళ్లి మాలను అతని మీదికి విసిరికొట్టి, కోతి చేష్టలు చేస్తున్న ఆ యువకున్ని ఎడాపెడా నాలుగు వాయించాడు.

 

 

ఇదెక్కడ జరిగిందో తెలియదు గాని పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన అతిథి.. వరుడితో మోటు సరసం ఆడాడు. బుగ్గలు గిల్లి ఆటపట్టించాడు. అతడిని వెనక్కి, ముందుకు కుదిపేస్తూ విసిగించాడు. దీంతో వరుడికి చిర్రెత్తుకొచ్చింది. వెనక్కి తిరిగి అతడిని చితకబాదాడు. ప్రతుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.

 

 

కానీ ఇక్కడ  ఈ వీడియో చూసిన వారు ఇక ముందు ఎవరితో ఇలా ప్రవర్తించకండి. ముఖ్యంగా నలుగురిలో మాత్రం అసలే ఇలాంటి చిలిపి పనులు చేయకండి. ఎందుకంటే నవ్వులు పోయి తన్నులు అవుతాయి. మీరెంత చిలిపి వారైన మీ చేతులను, నోటిని అదుపులో పెట్టుకోండి పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టకండి. ఆనందంగా గడిపే చోటును విషాదంగా మార్చకండి. ఇక ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: