ఇరాన్ దెబ్బకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వణికిపోతోంది. మూడు రోజుల క్రితం ఇరాన్  సైనిక కమాండర్ సులేమానీని అమెరికా హతమార్చిన విషయం తెలిసిందే. సులేమానీ అంటే మామూలు విషయం కాదు. ఒకరకంగా అధ్యక్షుడు అయితొల్లా ఖొమేనీతో సమాన అధికారాలు, సమాన ఆధరన ఉన్న అత్యంత ప్రముఖ వ్యక్తి. అలాంటి వ్యక్తిని అమెరికా చాలా పకడ్బందిగా ప్లాన్ చేసి ఇరాక్ రాజధాని భాగ్దాద్ విమానాశ్రయంలో హతమార్చింది.

 

 ఎప్పుడైతే సులేమానీ హతమయ్యాడో  వెంటనే అధ్యక్షుడు ఖొమేనీ రియాక్డయ్యాడు. సులేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ శపథం చేశాడు. అంతే కాకుండా  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపై రూ. 585 కోట్ల ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి తలమీద వేరే దేశం  ప్రైజ్ మనీని ప్రకటించటం బహుశా ఇదే మొదటిసారేమో ?    

 

 ఈ విషయం ఇలా ఉండగానే ఇరాన్ నుండి అమెరికా బలగాలను వెనక్కు వెళ్ళిపొమ్మని ఆదేశించినా వెళ్ళలేదు. అందుకనే మంగళవారం అమెరికా సైనిక స్ధావరాలపై ఇరాన్ దాడులు చేసింది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ పైన ఇరాన్ ఏరూపంలో ఎక్కడి  నుండి  దాడి చేస్తుందో తెలీక వణికిపోతోంది. అమెరికా దాడుల్లో ఇరాన్ దెబ్బతినటం మామూలు విషయమే. అయితే ఇరాన్ దాడిలో అమెరికా దెబ్బతింటే అది ప్రపంచంలోనే  సంచలనమవుతుంది.

 

అందుకనే ఇపుడు అమెరికా వణికిపోతోంది.  ఎప్పుడేమవుతుందో తెలీక  వైట్ హౌస్ చుట్టు పక్కల ప్రాంతాలో హై అలర్ట్ ప్రకటించారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు  అమెరికా లా ఎన్పోర్స్ మెంటు అధికారులు ప్రకటించారు. ఇరాన్ హెచ్చరికల నేపధ్యంలో మొత్తం వైట్ హౌస్ చుట్టూ 24 గంటలూ భద్రతా బలగాలను మోహరించారు.

 

వైట్ హౌస్ చుట్టుపక్కల అమెరికా సీక్రెట్ సర్వీసు ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక అధికారులు కాపలా ఉంటున్నారు. మొత్తానికి ఖాసీం సులేమానీని హతమార్చిన తర్వాత అమెరికాలో టెన్షన్ పెరిగిపోవటమే విచిత్రంగా ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: