కస్టమర్ ల కి బాగా దగ్గర అవ్వడం కోసం , మంచి సర్వీస్ లు అందించడం కోసం , వారిని అప్పుడప్పుడూ చార్జీలతో ముంచెత్తడం కోసం ప్రతీ బ్యాంకూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇండియా లోనే బ్యాంకులకి పెద్దన్నగా చెప్పుకున్న ఎస్‌బి‌ఐ కూడా తన వంతు కర్తవ్యం ఎప్పుడూ సాగిస్తూ ఉంటుంది. విత్ డ్రా సర్వీస్ ల విషయం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్తంత ముందుగానే దూసుకెళ్తోంది అని చెప్పచ్చు. ఎస్‌బీఐ కస్టమర్ల ఏటీఎం క్యాష్ విత్‌డ్రా పరిమితి డెబిట్ కార్డు వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది క్లాసిక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటారు.  దీని కారణం గా డెబిట్ కార్డ్ తో రోజుకి 20000 రూపాయల వరకూ డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇది మాగ్జిమం లిమిట్ అంటే గరిష్టం అనమాట. ఏటీఎం నుంచి కాకుండా పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్స్, ఈకామర్స్ పోర్టల్స్‌లో కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉపయోగించొచ్చు.  అదే సమయం లో యాభై వేల రూపాయల వరకూ ఎంత ఐనా షాపింగ్ బిల్ కార్డ్ ద్వారా కట్టుకోవచ్చు.

 

 

రోజుకు డెబిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో రూ.50 వేలు ఖర్చు చేయొచ్చు. పీవోఎస్ మెషీన్లకు కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది. అయితే ఎస్‌బి‌ఐ లోనే కొన్ని స్పెషల్ కార్డ్ లు ఉన్నాయి. వాటిని క్లాసిక్ డెబిట్ కార్డ్ లు అంటారు. వారు అన్నీ రకాల ఆన్ లైన్ కొనుగోళ్ళు , క్యాష్ విత్ డ్రాయల్స్ చేయచ్చు .. వాటికి ఎస్‌ఎం‌ఎస్ అలర్ట్ లు కూడా వస్తాయి. దేశవ్యాప్తంగా 5 లక్షల మర్చంట్ ఔట్‌లెట్స్‌లో షాపింగ్ చేయొచ్చు.  ఆన్‌లైన్‌లోనే మూవీ సినిమా టికెట్లు, బిల్లుల చెల్లింపు వంటి ఇతర పనులను చక్కబెట్టుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

 

 

ఈ క్లాసిక్ కార్డ్ కావాలి అంటే ఎస్‌బి‌ఐ వారు ఫ్రీగానే ఇస్తారు కాకపోతే ప్రతీ సంవత్సరం మైంటైన్ చేసినందుకు నూట పాతిక రూపాయలు వసూలు చేస్తారు.. దీనికి జి‌ఎస్‌టి కూడా అదనంగా ఉంటుంది. ఎప్పుడైనా మీ కార్డ్ పోయినా దాన్ని మరొక కార్డ్ తో రీప్లేస్ చెయ్యాలి అన్నా అప్పుడు రూ.300 చెల్లించాలి. 1800 11 2211 టోల్‌ఫ్రీ నెంబర్‌ కి ఫోన్ చేసి కార్డు ఆర్డర్ చేయచ్చు. contactcentre@sbi.co.in మెయిల్‌ కూడా పంపొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: