ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. అధికార - విపక్షాల మీద గొడవలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసి ఏడు నెలలు గడిచినా ఇప్పటికీ ఆ వేడి మాత్రం అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా అమరావతి విషయం లో జగన్ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు అనేది నడుస్తున్న ఈ తరుణం లో జగన్ మోహన్ రెడ్డి ని ఎదురుకోవడం కోసం చంద్రబాబు చాలామందిని రంగంలోకి దింపుతున్నారు.

 

 

తన సైన్యం లో బుద్ధా వెంకన్న కి అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ఆయనతో రకరకాల కామెంట్ లు చేయిస్తున్నారు. మొన్ననే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ని బుద్ధా వెనకేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే ! భువనేశ్వరి అమరావతి వచ్చివెళ్లినప్పటినుంచీ వైసీపీనేతల వెన్నులో వణుకు మొదలైందని, జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపులకు బలవుతున్న రాజధాని రైతుల్ని పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు సతీమణిపై నోరుపారేసేకోవడం మానుకోవాలని టీడీపీ అధికారప్రతినిధి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు.

 

 

ఇవాళ మళ్ళీ ఫైర్ అయిన వెంకన్న జగన్ కి  వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు చెవి మిషన్, కళ్లజోడును కానుకగా పంపించారు. " నేనున్నాను అన్నావు .. నేను విన్నాను అన్నావు .. ఇప్పటి వరకూ నువ్ చేసిన దానికి దిక్కు లేదు.. 22 రోజుల నుంచీ రైతులు ధర్నాలు - ఆందోళనలూ చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? ఏం వింటున్నావు ? " అని బుద్ధా వెంకయ్య ఎద్దేవా చేశారు. ఆరుగురు రైతుల గుండె కోత సీఎంకు వినబడలేదా? అని నిలదీశారు. వైకాపా కూడా బుద్ధా వెంకన్న కి గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది అని తెలుస్తోంది. ఏదేమైనా అమరావతి అంశం రెండు పార్టీ ల మధ్యా చిక్కు రేపుతోంది. ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: