దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రోడ్బు ప్రమాదాలకు ముఖ్య కారణం వాహనదారులు మద్యం సేవించి నడపడం.. అత్యంత వేగం..కొన్ని అనుకోని పరిస్థితులు.  ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఒకటి అయితే.. వేల మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వారే ఎక్కువ.  ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు దిక్కులేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ అధికారులు చెబుతున్న ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యంతో కొంత మంది హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేస్తుంటారు.  

 

ఇలా ప్రయాణలు చేసే సమయంలోనే ఏదైనా ప్రమాదం జరిగితే అయ్యో హెల్మెట్ ఉంటే తలకు దెబ్బ తగలకుండా బతికి పోయేవాడే అని బాధపడుతుంటారు. హెల్మెట్  పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తోంటే చాలా మంది పట్టించుకోరు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్తోన్న సమయంలో తాను హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా తన వెనుక కూర్చున్న కుక్కకు కూడా హెల్మెట్ పెట్టాడు. తాను ఎంతో మురిపంగా పెంచుకుంటున్న కుక్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని హెల్మెట్ దరింపజేసి తన వెంట ఎక్కుడికైనా తీసుకు వెళ్తున్నారు.  

 

అయితే ఆ వాహనదారుడి జాగ్రత్త చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  ఈ పాటి జ్ఞానం మనుషులకు ఉంటే.. ఈ కుక్కను చూసైనా బుద్ది తెచ్చుకొని హెల్మెట్ ప్రాణాలు రక్షిస్తుందని అర్థం చేసుకోవాలని అంటున్నారు. శునకం హెల్మెట్‌ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసైనా హెల్మెట్ పెట్టుకోని వారు మారతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: