అమరావతి  తరలింపు విషయంలో పెద్ద రగడ జరుగుతున్నది.  దీనిని ఎలాగైనా ఆపడానికి తెలుగుదేశం పార్టీ, రైతులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.  రాజధానిని తరలించేందుకు వైకాపా ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్నది.  ఈ విషయంలో ఎలాగైనా సరే విజయం సాధించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.  నిన్నటి రోజున రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారు.  ధర్నాలు చేశారు.  అక్కడితో ఆగలేదు.  


గుంటూరు, మంగళగిరి హైవే మీద రైతులు భారీ సంఖ్యలో చేరి నినాదాలు చేశారు.  రాకపోకలకు అడ్డంకి కల్గించారు.  అయితే, అదే సమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారును రైతులు అడ్డుకున్నారు.  కారుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.  దీంతో పిన్నెల్లి దీనిపై సీరియస్ అయ్యారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులే దాడులు చేశారని వాపోయారు.  అయితే, దీనిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది.  


అక్కడ ఉన్న వాళ్లంతా కూడా రైతులే అని, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరూ లేరని అంటున్నారు.  రైతులకు కడుపుమండితే ఇలానే ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, రివర్స్ లో ఎమ్మెల్యే కారుపై దాడి చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కాదని, వైకాపా కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు.  భూముల విషయంలో ఎవరూ కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరని, పంటలు పండే భూములను అమరావతి కోసం ఇచ్చామని, ఇప్పుడు రాజధానిని మారిస్తే మాత్రం ఊరుకునేది లేదని అంటున్నారు.  


ఇకపోతే, ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో 15 మందిపై కేసులు నమోదయ్యాయి.  ఇలా కేసులు పెట్టడం తగదని అంటున్నారు.  రాజధాని విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని, అమరావతిలోని రాజధానిని ఉంచాలని అంటున్నారు.  కానీ, జగన్ ఎవరూ చెప్పినా వినేటట్టుగా కనిపించడం లేదు.  ఈనెల 20 తరువాత అమరావతిని మార్చేందుకు రెడీ అవుతున్నారు.  మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.   రాజధాని విషయంలో ఈ రగడ ఎప్పటికి చల్లారుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: