ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ విలీనం చెయ్యాలంటూ దాదాపు 55 రోజులు సమ్మె చేశారు. కానీ ఏ ఫలితం లేకపోయే అయితే ఆలా సమ్మె చేసిన జీతాలు కూడా ఇచ్చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పి అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగుల మనసు దోచుకున్నాడు. అయితే అలా ఇచ్చిన మాట ఇప్పుడు సంక్రాంతి గిఫ్టుగా ఈ నెల వారి ఖాతాల్లో జీతం పడనుంది.                     

 

దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అంటే ఈ నెల 11న ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో 202 మంది సభ్యులను నియమిస్తూన్నట్టు సర్కార్ సర్కులర్ ను జారీ చేశారు.                     

 

ప్రతి డిపో నుంచి సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. వీరు ఆ డిపో పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తారు. అంతే కాదు అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను కూడా యాజమాన్యం చెల్లించింది.                  

 

దీంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ వారి ఇంట సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చాడు అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా బడి పిల్లలకు తెలంగాణాలో జనవరి 11 నుంచి 16 వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు.. అదే అంటే.. సిలబస్ కంప్లీట్ చెయ్యాలి కదా అంటున్నారు. గత ఏడాది దసరా సమయంలో జరిగిన సమ్మె కారణంగా పిల్లలకు అతిగా సెలవులు ఇచ్చినట్టు ఇప్పుడు అందుకే కొత్త విధిస్తున్నట్టు వారు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: