జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్ళను జనసేన అధినేత పవన్ కల్యాన్ నట్టేట ముంచేశారు.  మార్చిలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ పోటి చేయటం లేదని ప్రకటించారు.  ఎవరైనా పోటి చేసేందుకు ఆసక్తి ఉంటే వారు ఇండిపెండెంట్ అభ్యర్ధులుగానే పోటి చేయాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. పార్టీ ఎందుకు పోటి చేయటం లేదంటే కొన్ని ప్రత్యేక పరిస్ధితుల కారణంగానే అట. కానీ ఆ ప్రత్యేక పరిస్దితులు ఏమిటో మాత్రం చెప్పలేదు.

 

మొత్తానికి తన తాజా నిర్ణయంతో చంద్రబాబునాయుడుకు సాయం చేద్దామని పవన్ డిసైడ్ అయినట్లు అర్దమైపోతోంది. అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపితో పాటు మిగిలిన పార్టీలు కూడా పోటి చేస్తే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలి చివరకు వైసిపికే లాభం కలుగుతుందని పవన్ భావించినట్లున్నారు. నిజానికి వైసిపి, టిడిపి తరపున మరో పార్టీ ఏదీ గట్టి పోటి ఇచ్చే స్దితిలో లేవన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ప్రతిపక్షాలుగా టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలున్నప్పటికీ టిడిపికి తప్ప మిగిలిన పార్టీలకు అభ్యర్ధులకు కూడా అన్నీ చోట్లా దొరకరన్నది వాస్తవం. ప్రస్తుత పరిస్ధితిల్లో అన్నీ చోట్లా గట్టి అభ్యర్ధులు దొరకటం టిడిపికే కష్టమని చెప్పాలి. అలాంటిది మిగిలిన పార్టీల సంగతి చెప్పనే అక్కర్లేదు. అందుకనే పార్టీ తరపున పోటి పెట్టటం మానేసి  టిడిపికి మద్దతుగా నిలవాలని  పవన్ నిర్ణయించినట్లే అనుమానంగా ఉంది.

 

 అందుకనే పార్టీ తరపున ఎవరినీ పోటికి పెట్టటం లేదని స్పష్టం చేశారు. మరి ఇండిపెండెంట్ లు మాత్రం ఎందుకంటే ఎక్కడైనా బలమైన అభ్యర్ధులుంటే వాళ్ళకు మద్దతుగా మాత్రం పనిచేస్తారట. పవన్ ఆలోచనలు వినటానికే విచిత్రంగా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో  పడిన దెబ్బకే పార్టీ పరువు పోయింది. మళ్ళీ అటువంటి పరిస్ధితే ఎదురవతుందని భయపడినట్లున్నాడు. అందుకనే తెలివిగా పోటి నుండే తప్పించుకున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: