ఏపీలో మరో సంగ్రామం మొదలు కాబోతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుండగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రోజు విడుదల చేశారు.ఈ మేరకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. ఫిబ్రవరి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.అలాగే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిషికేషన్ జారీ చేయాలని, ఏపీ హైకోర్టు ఆదేశించింది.


 మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను కోర్టుకు సమర్పించారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మార్చిలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికాబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ కు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఎంపీటీసీ, జెడ్పిటీసీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కసరట్టుని మొదలుపెట్టింది. ఈ మేరకు జిల్లాల వారీగా జెడ్పీ, ఎంపీటీసీ, పంచాయతీలకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. 


ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారం లో ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మిగతా చోట్ల తమకు అనుకూలంగా ఉంటాయని అధికార పార్టీ భావిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిన నేపథ్యంలో తమకే ఎక్కువగా కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. ఏది ఏమైనా గ్రామ స్థాయి రాజకీయాలతో సందడి వాతావరణం నెలకొనబోతోంది. అయితే ఈ స్థానిక పోరుకి జనసేన పార్టీ సిద్ధం అవుతుందా లేక వేరే పార్టీకి మద్దతు ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: