ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన మూడు రాజధానుల అంశాన్ని ఎన్జీవో లు కూడా  అనుకుకూలంగానే ఉన్నారు. మొత్తానికి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి నుంచి రాజధాని తరలింపును స్వాగతిస్తున్నట్టేగా మరి. ఉద్యోగ సంఘం ఎన్నిక నేపథ్యంలో ఆ సంఘ నేతలు పై విధంగా స్పందించడం గమనార్హం. ఎపి ఎన్జీవో సంఘం ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ఎపి ఎన్జీవోల సంఘం ఎన్నికల అధికారి రామకృష్ణ వెల్లడించారు. నామినేషన్ లు ఫిబ్రవరి 2 వ తేదీన మొదలయ్యి అదే రోజు పరిశీలించి,ఆమోదించడం జరుగుతుంది. ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడ ఎపి ఎన్జీవో కార్యాలయం నందు ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. 


స్వాగతించాలని నిర్ణయించాము.. 
జియన్ రావు కమిటీ నివేదిక పై మా సంఘం సమావేశంలో చర్చించాం, దాన్ని స్వాగతించాలని నిర్ణయించమని  ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం మాకుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన విధంగా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని కాంక్షించామన్నారు. ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న అందుకు  కట్టుబడి ఉండాలని నిర్ణయించామని చంద్రశేఖర రెడ్డి తెలిపారు. 

సచివాలయం ఉన్న చోటే..

ఉద్యోగులుగా మేము ఉద్యమంలోకి ఎందుకు రావడం లేదంటే నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. హెచ్ ఓడిలు అన్ని సచివాలయం ఉన్న చోటే ఉండాలని మేము కోరుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై మా కార్యవర్గంతో సమావేశమయ్యి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: