ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. సీఎం జగన్ ఫిబ్రవరి నెల నుండి గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈరోజు సీఎం జగన్ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందాల్సిందేనని సీఎం జగన్ సూచించారు. 
 
సీఎం జగన్ వాటర్ గ్రిడ్, నాడు - నేడు పథకంలో భాగంగా స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, ఉపాధి హామీ పనుల గురించి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలను, గ్రామ సచివాలయాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.మినీ గోడౌన్ల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 
 
పెన్షనర్లకు ఫిబ్రవరి నెల నుండి గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా ఇంటివద్దనే పెన్షన్లు అందజేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లు పొందుతున్నవారు ఎవరూ కూడా పెన్షన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఇళ్ల పట్టాలను సర్వేలతో ముడిపెట్టి నిరాకరించవద్దని తెలిపారు. అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఇళ్లపట్టాలు ఇవ్వాల్సిందేనని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. 
 
సీఎం జగన్ కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల ద్వారా మరో 3000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాలలో 15,971 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీఎం జగన్ అధికారులకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచనలు చేశారు. అధికారులు సీఎం జగన్ కు మార్చి నాటికి అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: