ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీవ్ర కలకలం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ యొక్క బాబాయి అయిన వివేకానంద రెడ్డి హత్య కేసు యొక్క దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. వివేక సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి తో సహా ఇప్పటికే 1400 మందినకి పైగా విచారించగా పోలీసుల అనుమానం పరమేశ్వర్ రెడ్డి పైనే నెలకొంది.

 

ఇలాంటి సమయంలో అతని ప్రతి కదలికను గమనిస్తున్న పోలీసులు మధ్యనే కడప లోని ఒక లాడ్జిలో పరమేశ్వర్ రెడ్డి ఒక టిడిపి నాయకుడితో గంటలు గంటలు మాట్లాడినట్లు సమాచారం. అయితే పోలీసు వారు అతనిని విచారణకు తీసుకెళ్ళి ఆ సమయంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో ఏం మాట్లాడుతున్నారు అన్న విషయంపై ఆరా తీశారు.

 

ఇదే నేపథ్యంలో సిట్ అధికారులు కీలక నిందితుడిగా అనుమానిస్తున్న పరమేశ్వర్ రెడ్డికి నార్కో టెస్టును నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించగా అతను మాత్రం నార్కో టెస్ట్ కు హాజరయ్యేందుకు విముఖత చూపిస్తుండడం ఇప్పుడు పోలీసుల్ని ఏం చేయాలో పాలుపోని స్థితిలో నిలబెట్టింది. అయితే నిజంగా పరమేశ్వర్ రెడ్డి ఏ తప్పూ చేయకపోతే అతను నార్కో టెస్టుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అన్నది ఇక్కడి ప్రశ్న.

 

అయితే సిట్ అధికారుల విచారణను సవాల్ చేస్తూ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోర్టును అభ్యర్ధించారు. పిటిషన్ విచారణలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: