కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా  పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఈరోజు అంటే జనవరి 8 న దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.ఈ స్ట్రైక్ లో, ట్రైడ్ యూనియన్లతో పాటు బ్యాంక్ యూనియన్లు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయన్న విషయం తెలిసిందే. ఈ బంద్ పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచే కొనసాగుంది. కాగా ఈ సందర్భంగా తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వామపక్ష పార్టీలపై విమర్శలు వర్షం కురిపించారు.

 

 

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే శాంతియుత ఆందోళనలకు మద్దతు ఇస్తామని, కానీ రాస్తారొకోలు, ధర్నాలుతో, బెంగాల్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తే చూస్తు ఉరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే కాకుండా రాజకీయంగా ఉనికి లేని పార్టీలు కొన్ని తమ ఉనికి నిలుపుకోవడానికే ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

అంతే కాకుండా పశ్ఛిమ బెంగాల్లో అనిశ్చితి పెంచేందుకు వామపక్షాలు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, లెప్ట్ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చిన ప్రభుత్వ బస్సులపై బాంబులు వేసి చీప్‌ పబ్లిసిటీ కోసం చూస్తున్నాయని ఆరోపించారు. ఇక ఇలాంటి సిగ్గుమలిన చర్యలు చేసే బదులు రాజకీయ సమాధి కావడం ఉత్తమని సూచించారు. ఈ విషయాలన్ని మమతా బెనర్జీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు..

 

 

ఇకపోతే ఎటువంటి విధానాలు లేని సీపీఎం రైల్వే ట్రాక్‌లు, బస్సులపై బాంబులను విసరడం, ప్రయాణికులపై దాడులు చేయడం లాంటి వారి హింస ధోరణి చింతించవలసిన విషయంగా పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బంద్ కు తమ మద్దతు ఉంటుంది. కాని దాని వెనక జరిగే హింసాత్మక చర్యలకు మాత్రం కాదని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: