జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసియార్ కలలోకి వచ్చినా సరే పవన్ వణికిపోతున్నట్లున్నాడు. అందుకనే పోటి మొదలు కాకముందే పవన్ చేతులెత్తేశాడు. ’కొన్ని ప్రత్యేక పరిస్దితుల వల్ల తెలంగాణా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గ్లాసు గుర్తుతో పోటి చేయటం లేదు’  అంటూ ఓ ప్రకటన రిలీజయ్యింది. పవన్ నిర్ణయమంటూ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ఓ ప్రెస్ రిలీజ్ విడుదలవ్వటంతోనే విషయం అర్ధమైపోయింది.

 

తొందరలో తెలంగాణాలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  అధికార టిఆర్ఎస్ తో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా పోటికి రెడీ అయిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే జనసేన పేరుతో వచ్చిన రిలీజ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే జనసేనను అసలు జనాలు  ఓ రాజకీయ పార్టీగానే గుర్తించటం లేదు.

 

ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుండి తెలంగాణా ప్రాంతంలో జనసేన చేపట్టిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. పైగా కేసియార్ కు వ్యతిరేకంగా మాట్లాడాలన్నా పవన్ వణికిపోతున్న విషయం చాలా సార్లే బయటపడింది. ఏపిలో అంటే చంద్రబాబునాయుడు కోసమని నోటికొచ్చినట్లు జగన్ మీద ఎగిరెగిరి పడుతుంటారు కానీ తెలంగాణాలో పవన్ కు అంత సీన్ లేదు.

 

విచిత్రమేమిటంటే కేసియార్ కూడా పవన్ ను పెద్దగా పట్టించుకోవటం లేదు. అధికార పార్టీకి మద్దతుగా ఉంటారు కాబట్టి టిఆర్ఎస్ మిత్రపక్షమని కూడా జనసేనను అనుకునేందుకు లేదు. అదే సమయంలో ప్రతిపక్షమని అనుకుందామా అంటే అంత సీనూ లేదు. కాబట్టి తెలంగాణాలో జనసేన ఎప్పుడో చాప చుట్టేసింది.

 

అన్నింటికంటే విడ్డూరమేమిటంటే జనసేన తరపున పోటి చేయటానికి వేలాదిమంది నేతలు పోటి పడుతున్నట్లు బిల్డప్ ఒకటి. ప్రత్యేక పరిస్ధితుల వల్ల అధికారికంగా పోటి చేయటం లేదని చెబితే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటారా ? పోటి చేసే వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటి చేయమని అనుమతిచ్చారు కదా ? చూద్దాం ఎంతమంది పోటి చేస్తారో ? ఎంతమంది తరపున పవన్ ప్రచారం చేస్తారో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: