గత కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కకావికలు చేసిన ఆర్టీసీ సమ్మె ప్రభావం మెల్లిమెల్లిగా కనబడుతోంది. సమ్మె కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను సగానికి కుదించేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండవ శనివారం కూడా ఇకమీదట పని దినంగానే కొనసాగనుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ముందు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జనవరి 11 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులను నిర్ణయించారు కానీ వాటిని 12 నుంచి 16 కి కుదించారు.

 

దాని తర్వాత బుధవారం జారీ చేసిన కొత్త ఉత్తర్వులలో రెండవ శనివారం గూర్చి ప్రకటించారు. ఇకపోతే గత ఏడాది 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగింది. దసరా పండుగ అయిపోయిన తర్వాత కూడా సమ్మె ఉద్రిక్తత అలాగే కొనసాగడంతో రాష్ట్ర ప్రజలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి కెసిఆర్ చాకచక్యంగా వ్యవహరించి దానిని అదుపులోకి తెచ్చినా అప్పుడు జరిగిన నష్టానికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పరిహారం చెల్లిస్తున్నారు.

 

సమ్మె విరమణ తర్వాత రెండో శనివారాన్ని కూడా వర్కింగ్ డేగా ప్రకటించి సిలబస్ పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటీ వరకు అమలులో ఉంటుందో వారు చెప్పలేదు. క్రమంలో సంక్రాంతి సెలవులను కుదించారు. గతేడాది క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగకు కలిసి 10 రోజులకు పైగా సెలవులు ఇవ్వగా.. ఈసారి సగానికి సగం తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: