ఎన్నికలు అనగానే అందరికీ జనసేన పార్టీ గుర్తుకు వచ్చేస్తుంది. అసలు ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే డౌట్ కూడా కలుగుతుంది. దీనికి కారణం ముందు నుంచి ఆ పార్టీపై అందరికీ ఉన్న అనుమానాలే కారణం. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ వ్యవహారం కూడా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటూ జనసేన అధికారికంగా ప్రకటించింది. అయితే అదే సమయంలో ఏపీలో స్థానిక ఎన్నికలకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేదా అని చర్చ ప్రారంభమైంది. 


జనసేన పార్టీ పెట్టి ఏడు సంవత్సరాలు దాటుతున్నా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేపట్టే లేకపోవడం వల్ల ఆ పార్టీ బలపడలేకపోయింది. నిన్ననే పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలను నిర్మించారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో పవన్ చూపిస్తున్న శ్రద్ద పార్టీ నిర్మాణంపై చూపించి ఉంటే ఇప్పటికే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడి ఎంతో ప్రభావం చూపించి ఉండేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే జనసేన పార్టీకి ప్రతి గ్రామంలోనూ, పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వారిని సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకులు కరువయ్యారు. దీంతో వారు జనసేన పార్టీ ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళ లేక పోతున్నారు. ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ దిమ్మలు కట్టి చేతులు దులుపుకుంటున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

 

 ప్రస్తుతానికి ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో జనసేన తెలంగాణలో తాము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పిన విధంగా ఏపీలోనూ ప్రకటిస్తే ఆ పార్టీ  భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. అలా అని తెలుగుదేశం పార్టీ మద్దతు కనుక తీసుకుంటే మొదటి నుంచి జనసేన, టిడిపి ఒకే తానులో ముక్కలు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజం చేసినట్టు అవుతుంది. మరి ఈ విషయంలో పవన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: