ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కష్టంలో ఉన్న వాళ్ళ విషయంలో కాకితో కబురు తెల్సిన చాలు ఆ అమాత్యుడు స్పందిస్తారు. మానవీయ కోణంలో సోషల్ మీడియా ద్వారా వెనువెంటనే తక్షణ చేయుట అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తర్వాతే ఎవరైనా. మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తనదైన శైలిలో సామజిక మాధ్యమాల ద్వారా తగి రీతిలో స్పందించారు. ఈ విషయంలో తరతమ భేదాలను అసలు చూడరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రజలకు ఈ విషయం సుపరిచితమే. ఈ క్రమంలోనే నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువుర్ని పరామర్శించారు. ఇందుకు వారి వారి స్థాయిలను కూడా చూడకుండా ఆయా రోగుల యోగక్షేమాలను విచారించారు. ఈ క్రమంలో బుధవారం నిమ్స్ కు వెళ్లిన మంత్రి కేటీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీమంత్రి రత్నాకర్ రావులతో పాటుగా   ప్రగతి భవన్ లో పనిచేస్తున్న కుక్ వెంకటేష్ , టీపీఎస్ సీ  చైర్మన్  తండ్రి పరామర్శించడం విశేషం. 


మంత్రి జగదీష్..
తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై నిమ్స్ లో చికిత్స పొందుతున్న రాష్ట్ర విద్యుత్తు శాఖ  మంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు. మంత్రి జగదీష్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కోరుకున్నారు.

నిమ్స్ లోనే చికిత్స పొందుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి  తండ్రి మొగులయ్యని కూడా మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అదే విధంగా నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న మాజీ మంత్రి రత్నాకర్ రావును కూడా మంత్రి పరామర్శించారు.


కుక్ కు కేటీఆర్ పరామర్శ 
ప్రగతి భవన్ లో పనిచేస్తున్న కుక్ వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడినందున, ప్రస్తుతం నిమ్స్ లో వైద్య చికిత్స జరుగుతుంది. వెంకటేష్ ని మంత్రి కేటీఆర్ పరామర్శించి, ఆయనకు అందుతున్న వైద్యం పైన నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: