తమ తప్పిదాల కారణంగా ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబ సభ్యులకు.. కారకులైన వారు నష్టపరిహారంగా ఎంతో కొంత డబ్బులు ఇస్తుంటారు. సాధారణంగా అయితే రూ. 5-15లక్షలు ఇస్తుంటారు. అయితే, అమెరికాలో ఒక 2ఏళ్ల బాలుడు తమ సంస్థలో తయారైన ఒక డ్రెస్సింగ్ టేబుల్ వల్ల ప్రాణాలు కోల్పోయాడని ఆ సంస్థ అధికారులు ఏకంగా రూ.329 కోట్ల నష్టపరిహారం చెల్లించారట. నమ్మశక్యంగా ఉంది కదా? ఇంతకీ ఆ ధనిక సంస్థ వారు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


కాలిఫోర్నియా లోని దంపతులు జోలీన్, క్రెయిగ్ లకు జోజెఫ్ అనే ఒక 2 ఏళ్ల బాలుడు ఉండే వాడు. అయితే, 2017 మే నెలలో ఒకరోజు జోజెఫ్ ని నిద్రపుచ్చాడు తండ్రి క్రెయిగ్. కానీ కొంతసేపటికి జోజెఫ్ నిద్రలేచి తన ఇంటిలో తిరుగుతూ.. ఐకియా డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వెళ్లి దాన్ని లాగుతూ ఆడుకోవడం ప్రారంభించాడు. అయితే, అనుకోకుండా ఆ డ్రెస్సింగ్ టేబుల్ బాలుడిపై పడింది. దాంతో, ఆ డ్రెస్సింగ్ టేబుల్ కింద నుండి బయటకి రాలేక.. ఇంకా ఊపిరాడక జోజెఫ్ తన తుది శ్వాస విడిచాడు. ఒక అరగంట తరువాత బాలుడు ఏంచేస్తున్నాడో చూడాలని వచ్చిన తండ్రికి ఘోరమైన దృశ్యం కనిపించింది. అదేంటంటే.. తమ ప్రియమైన కుమారుడి తల డ్రెస్సింగ్ టేబుల్ లోని ఒక సొరుగులో ఉండగా.. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం తనపైన పడి ఉండటం. దాంతో అతడు లబోదిబోమంటూ ఏడవడంతో భార్య జోలీన్ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయింది. ఆపై వీళ్లిద్దరు డ్రెస్సింగ్ టేబుల్ ను నిల్చోబెట్టి కుమారుడు జోజెఫ్ ని ఎత్తుకొని ఆసుపత్రికి తరలించగా 'బాలుడిని చనిపోయిన తరువాత తీసుకొచ్చారు' అని వైద్యులు చెప్పడంతో వాళ్లు కన్నిమున్నీరయ్యారు.


ఆ తరువాత... ప్రమాదకరమైన డ్రెస్సింగ్ టేబుల్ ని ఐకియా సంస్థ వారు తయారు చేసినందుకే తమ కుమారుడు చనిపోయాడని కోర్టుకెక్కగా.. చివరికి వాళ్లకు నష్టపరిహారంగా 46 మిలియన్ల డాలర్లను ఇచ్చేందుకు ఒప్పుకున్నారు ఐకియా సంస్థ వారు. $46మిలియన్ల అంటే మన కరెన్సీ లో రూ.329కోట్లు. అలాగే, వారు మాట్లాడుతూ.. 'మేము తయారు చేసిన డ్రెస్సింగ్ టేబుళ్లు ఫ్రీ గా నిల్చోపెట్టడానికి కాదు, అవి కేవలం వాల్స్ కి అమర్చేవి. ఎవరూ దయచేసి అలా యూజ్ చేయకండి.' అని చెప్పుకొచ్చారు. అయితే, వాళ్లు తయారు చేసిన ఈ డ్రెస్సింగ్ టేబుళ్ల వలన ఇతర పిల్లలు కూడా గాయపడ్డారని అనేకమైన ఫిర్యాదులు రావడంతో.. వారు వారి ఐటమ్స్ ను తిరిగి ఇచ్చేస్తే డబ్బులిస్తామని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: