పవర్ స్టార్ గా పవన్ కల్యాణ్ కి ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక తెలంగాణా లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన పాలిటిక్స్ లోకి వస్తున్నారు అంటే ఆంధ్ర ప్రదేశ్ జనలతో పాటు అక్కడ జనం కూడా చాలా సంతోషించారు.

 

 

నిజానికి పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావమే తెలంగాణ లో జరిగింది. అప్పట్లో హోటల్ Novotel లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ని ప్రకటించారు.

 

 

ఆ సభ కి వేలాది మంది వచ్చారు. దాదాపు అందులో తొంభై శాతం మంది తెలంగాణ సపోర్టర్ లూ , ఫాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యం లో పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు పోటీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది మాత్రం అస్సలు జరగడం లేదు.

 

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎమర్జింగ్ అవుతున్న జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఉంది.ఇక ఏపీ రాజకీయాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క స్థానంకి పరిమితం అయిన కూడా ఎన్నికల తర్వాత ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ తనదైన శీలిలో దూసుకెళ్తున్నారు. కానీ రాక రాక వచ్చిన అవకాశాన్ని తెలంగాణా లో మాత్రం వదులుకుంటున్నారు.   

 

 

తెలంగాణ లో మునిసిపల్ ఎలక్షన్స్ రానున్నాయి ఇప్పుడైనా పవన్ అడుగు పెడతారు అనుకుంటే అది లేకుండా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఫాన్స్ తో పాటు ఎవ్వరికీ నచ్చడం లేదు. ఈ ప్రకటన అధికారికంగా రావడంతో మరోసారి జనసేన అభిమానులకి తెలంగాణలో పవన్ కళ్యాణ్ మొండిచేయి చూపించినట్లు అయ్యింది.పవన్ కళ్యాణ్ అప్పుడే చేతులెత్తేసాడని .. తెలంగాణా లో పవన్ ని నమ్ముకుంటే నిండా మునిగిపోతాము అని పవన్ ఫాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ! 

మరింత సమాచారం తెలుసుకోండి: