తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కి చిన్న జీయర్ స్వామి ఎంత క్లోజ్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన ముందు సి‌ఎం ఐనా కూడా నేలమీద కూర్చునే కే‌సి‌ఆర్ ఆయన చెప్పిన అనేక యాగాలు చేస్తూ ఉంటారు అని అంటారు. మామూలుగానే కే‌సి‌ఆర్ కి భక్తిభావం చాలా చాలా ఎక్కువ . పూజలు , పునస్కారాల దగ్గర నుంచి యాగాలు , హోమాలు ఎప్పటికప్పుడు జరిపిస్తూ ఉంటారు కే‌సి‌ఆర్. మంత్రి కేటీఆర్ ఎప్పుడూ నాస్తికుడిని అని చెప్పుకోనప్పటికీ ఏ మతపరమైన కార్యక్రమం వేడుకల్లో పాల్గొనకుండా ఆచారాలు పాటించకుండా దూరంగా ఉంటారు.

 

 

తన తండ్రి ఎక్కువగా గుళ్లూ గోపురాలూ చూడుతూ ఉన్నా కే‌టి‌ఆర్ పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎప్పుడూ. ఆ మాటకి వస్తే గడిచిన 10 సంవత్సరాలలో కే‌టి‌ఆర్ ఎప్పుడూ గుళ్ళు దర్శించలేదు అని టి‌ఆర్‌ఎస్ లో ఒక టాక్ కూడా ఉంది . అప్పట్లో కే‌సి‌ఆర్ తిరుపతికి వెళ్లినప్పుడు కూడా కేటీఆర్ ఆయనతోపాటు వెళ్లలేదు. కానీ కేటీఆర్ కొడుకు, కుమార్తె మాత్రం ఎప్పుడూ కేసీఆర్ తోనే కనిపిస్తారు.కేసీఆర్ సహస్ర చండీయాగం.. సుదర్శన యాగం లాంటి భారీ యాగాలు చేసినప్పటికీ కేటీఆర్ ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి కేటీఆర్ దేవుడిని నమ్మడని.. నాస్తికుడని అందరూ భావిస్తుంటారు.

 

 

రీసెంట్ గా కే‌టి‌ఆర్ లో కనిపిస్తున్న అనూహ్య మార్పుకి కారణం చిన్న జీయర్ స్వామి అనే టాక్ హైదరబాద్ లో వినిపిస్తోంది. గత నెలలో కేసీఆర్ తోపాటు సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని కేటీఆర్ దర్శించుకున్నారు.  అక్కడ నుంచి మొదలు టి‌ఆర్‌ఎస్ వరసగా గుళ్ళ దర్శనాలు చేస్తున్నారు. కేటీఆర్ కు ఈసంవత్సరం జాతకం ప్రకారం ‘రాజయోగం ’ ఉంది అని .. దీనిని సాధించడానికి వీలైనన్ని దేవాలయాలు దర్శించాలి అని చిన్న జీయర్ కోరడం తో ఇది జరుగుతోంది అనే మాట వినిపిస్తోంది !!

మరింత సమాచారం తెలుసుకోండి: