జగన్‌ నాయకత్వంలో దుర్మార్గమైన, పెత్తందారీ ప్రభుత్వం అత్యంత రాక్షసంగా  , అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజాభిమానం పొందాలి, వారి సంక్షేమానికి   పాటుపడాలనే ధ్యాస ప్రభుత్వపెద్దల్లో మచ్చుకైనా కనిపించడంలేదని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆక్షేపించారు. ప్రత్యర్థుల్ని భయపెట్టి రాజకీయాలను శాసించాలన్న దుష్టఆలోచన జగన్‌ మదిలో పుట్టిందని, దానివల్లే రాష్ట్రవ్యాప్తంగా అనేక దుష్పరిణామాలు జరుగుతున్నాయన్నారు. అందులోభాగంగానే దివంగతనేత, మాజీస్పీకర్‌ కోడెలశివప్రసాదరావుపై, వారి కుటుంబసభ్యులపై 16అక్రమకేసులు పెట్టడం జరిగిందని, దానికి కొనసాగింపుగా 8మంది టీడీపీ ఎమ్మెల్యేలపై, 11మంది మాజీ ఎమ్మెల్యేలపై, 4గురు ఎమ్మెల్సీలపై, 24మంది రాష్ట్రస్థాయి టీడీపీనేతలపై అక్రమకేసులు మోపడం జరిగిందన్నారు. 

 

కేసులకు భయపడి టీడీపీనేతలు ప్రజల్లోకి రావడం మానుకుంటారన్న అపోహల్లో ముఖ్యమంత్రి ఉన్నట్లున్నాడని, అందులోభాగం గానే ఈవిధంగా తప్పుడుకేసులు బనాయిస్తున్నాడని కాలవ స్పష్టంచేశారు. ఈకోవలోనే టీడీపీ మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై, ఎస్సై స్థాయివ్యక్తితో తప్పుడు కేసు పెట్టించారన్నారు. చినకాకానిలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్ధతు తెలపడానికి వెళ్తారన్న అనుమానంతో 7వతేదీ ఉదయాన్నే బొండాఉమాను అడ్డుకున్న ఎస్సై యాదగిరి అర్జున్‌, 8వతేదీన ఉమామహేశ్వరరావుపై తప్పుడు కేసు పెట్టడం జరిగిందన్నారు. మాజీఎమ్మెల్యే తనను దూషించాడని, బొండా ఉమా, ఆయన అనుచరు లు తనవిధులకు ఆటంకం కలిగించాడని, తనముఖాన పేపర్లు విసిరికొట్టాడని,   సదరు ఎస్సై తనఫిర్యాదులో పేర్కొన్నాడని కాలవ తెలిపారు. వాస్తవానికి ఎస్సై అర్జున్‌ ఉమాని అడ్డగించాడని, తానేమీ సంఘ విద్రోహచర్యలకు పాల్పడటం లేదని, తన ప్రయాణాన్ని అడ్డుకోవద్దని ఉమామహేశ్వర రావు ఎస్సైని కోరడం జరిగిందన్నారు. 

 

పోలీస్‌ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా బొండా ఉమా ఎలాంటి ర్యాలీలు, ఆందోళనలు చేయలేదని, ఆయన ఎక్కడా, ఏసందర్భంలోనూ ఎటువంటి నినాదాలు కూడా ఇవ్వలేదని కాలవ వివరించా రు. కానీ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదులో, ఉమా సీఎం డౌన్‌.. డౌన్‌ అన్నాడని, జై అమరావతి నినాదాలతో భయాందోళన సృష్టించి, తనను అవమానించినట్లు,  చెప్పడం అవాస్తవమ న్నారు. ఈ సందర్భంగా ఎస్సైకి, బొండా ఉమాకి మధ్య జరిగిన సంభాషణ వీడియోను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతో, అసత్యాల తో కూడిన ఫిర్యాదులు ఇస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమకుతామే రాజకీయం గా బలి పశువులు అవుతున్నామనే విషయాన్ని గ్రహిస్తే మంచిదని కాలవ హితవు పలికారు. రాజధాని భూముల కొనుగోళ్ల వ్యవహరంలో వైసీపీనేతల చిట్టాను బయట పెట్టారన్న అక్కసుతోనే, రాష్ట్రప్రభుత్వం బొండా ఉమాపై ఈవిధంగా తప్పుడుకేసు మోపిందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: