సామాన్యులకంటే దేవుడు ఎప్పుడూ దూరమే కాని, ఓ స్ధాయి వున్న వారిని కూడా అప్పుడప్పుడు దేవుడు కూడా దూరం పెడతాడా అంటే అవుననే అనిపిస్తుంది. వాస్తవానికి ఆ దైవం కరుణాకటాక్ష్యాలు వుంటే తప్ప సాధ్యం కాదని కూడా భక్తుల విశ్వాసం. ఆ విషయం తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావుకు బాగా తెలిసొచ్చినట్టుందిగా. ఆయన విషయంలో ఆ దేవుడు కూడా ముఖం తిప్పుకున్నట్టు అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే ఉత్తర ద్వారా ముఖంగా శ్రీవారిని దర్శించి తరించేందుకు తెలంగాణ మంత్రిలు స్వయానా బావ బావమరుదులు తిరుమలకు చేరుకున్నారు. వేర్వేరుగా ఏడుకొండలెక్కిన ఈ అమాత్యుల పట్ల తిరుమల తూరుపతి దేవస్థానం పాలకవర్గం వలపక్షం చూపించి తన బుద్ధి చాటుకుందన్న విమర్శ లేకపోలేదు.   


హరీష్‌కు చిన్న పీట..


తెలంగాణ మంత్రి కేటిఆర్‌కు పెద్దపీట. మంత్రి హరీష్‌కు చిన్న పీట. అని అదేంటి దేవుడి దగ్గర కూడా ఇలాంటి మర్యాదలు కూడా వుంటాయా అంటే..  అదేంటి ఇద్దరూ ఒక్కటే. ఇద్దరూ బావబామ్మర్థులే. ఇద్దరూ మంత్రులే. ఇద్దరూ ఒక గూటి పక్షలే.. అయితేనేం దేవుడి దగ్గర మాత్రం ఎవరికి వారే అన్న చందంగా ఇరువురి దర్శినాలు జరిగినట్టు సమాచారం. అసలు మంత్రి హరీష్ రావు తిరుమలకు వస్తున్న సంగతి తెలిసినా పట్టించుకున్నవారు కరువయ్యారట. వాస్తవానికి మంత్రి హరీష్ కు  వెంకన్న అంటే ఎంతో భక్తి. తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి సారి కాలినడకన కొండెక్కి దర్శనం చేసుకుంటాడు.

కోపం రావడం  సహజమే..

అలాంటి భక్తుడికి కోపం రావడం కూడా సహజమే కదా. ఫలితంగా తనకు తగిన ఆదరణ దొరకలేదన్న ఉక్రోషంతో  నేను దర్శనం చేసుకో నాటు బీష్మించారంట. అయితే ఆయన వెంబడి ఉన్న అనుమాయులు బుజ్జగించి మరి శ్రీవారి దర్శనమే చేయించినట్టు విశ్వనీయ సమాచారం.  కానీ మంత్రి కేటీఆర్ ను చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి లాంటి వారు దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం దూరమౌతుందని భావించి, మరింత దగ్గర దర్శనం, మెరుగైన దర్శనం చేయించారు. మరి హరీష్‌ నెందుకు దూరం పెట్టారన్న చర్చ అంతర్గతంగా సాగుతుంది. పైకి మాత్రం ఎవరికీ వాళ్ళు తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: