రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం, కోతలఒడి అని,  విద్యార్థుల్ని తగ్గించడంద్వారా తల్లులకు కడుపుకోతను మిగిల్చిన జగన్‌,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలోని నిధులను ఆపథకానికి మళ్లించడం ద్వారా ఆయా వర్గాలకు కూడా తీరనిఅన్యాయం చేశాడని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.  'అమ్మఒడి' అమలుకోసం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబో ముఖ్యమంత్రే సమాధా నం చెప్పాలన్నారు. 

 

టీడీపీప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు తీరనిద్రోహం చేసిందని, ప్రతిపక్షంలో ఉండి గగ్గోలుపెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చాక తానన్నది విస్మరించి, పాదయాత్రలో ఇచ్చిన హామీలను మంటగలిపి, ఆయావర్గాలకు చెందాల్సిన నిధుల్ని 'అమ్మఒడి'కి మళ్లించడం దారుణమన్నారు. పథకం అమలును తాముతప్పపట్ట డంలేదన్న నిమ్మల, వాస్తవంగా పథకానికి అర్హులైన అనేకమంది విద్యార్థులకు జగన్‌ అన్యాయం చేశాడన్నారు. 04-01-2020న జీవోనెం-6ద్వారా బీసీకార్పొరేషన్‌ నుంచి రూ.3,432కోట్లను అమ్మఒడికి మళ్లించారని, అధికారంలోకి వచ్చినవెంటనే బీసీలకు ఏటా రూ.15వేలకోట్లు ఇస్తానన్న జగన్‌, బీసీకార్పొరేషన్‌కు గండికొట్టి అక్కడున్న నిధులను ఇతరపథకాలకెలా మళ్లిస్తున్నాడో బీసీలకు సమాధానం చెప్పాలన్నారు. 

 

ఇది బీసీలను మోసంచేయడం కాదా అని నిమ్మల నిలదీశారు. వైసీపీమేనిఫెస్టోలో కాపుల అభ్యున్నతి కోసం ప్రతిఏటా రూ.2వేలకోట్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు కాపుకార్పొరేషన్‌ నుంచి జీవోనెం-5ద్వారా, రూ.568కోట్లను అమ్మఒడి పథకానికి ఎలా తరలించాడో, వారిని ఎలా వంచించాడో చెప్పాలన్నారు. రూ.2వేలకోట్ల లో రూ. 568కోట్లకు గండికొట్టిన ముఖ్యమంత్రి, మిగిలిన రూ.1400కోట్లలో కూడా ఇప్పటివరకు కాపువర్గానికి ఒక్క రూపాయిచ్చిన పాపానపోలేదన్నారు. మైనారిటీలపై ఎంతోప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్‌సర్కారు, వారినికూడా రోడ్డునపడేసిందన్నారు. 

 

జీవోనెం-1ద్వారా 04-01-2020న మైనారిటీకార్పొరేషన్‌ నుంచి రూ.442కోట్ల ను అమ్మఒడి పథకానికి తరలించడం జరిగిందన్నారు. ఎస్టీ కార్పొరేషన్‌నుంచి జీవోనెం - 6ద్వారా రూ.395కోట్లను, ఎస్సీకార్పొరేషన్‌నుంచి రూ.1271కోట్లను అమ్మఒడికి  తరలించిన ఘనత జగన్‌కే దక్కిందని నిమ్మల దుయ్యబట్టారు. కొత్తపథకాన్ని ప్రకటించే ముందు, నిధులలభ్యత సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  వర్గాలనిధులకు కోతపెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీఎమ్మెల్యే నిగ్గదీశారు.  

 

 అర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభించిన అమ్మఒడి పథకంలో లబ్ధిదారుల సంఖ్యను  ప్రభుత్వం కుదించిందన్నారు. 42లక్షల మందితల్లులకు, 84లక్షలపైచిలుకు విద్యార్థుల కు పథకం కింద లబ్ది కలుగుతుందని, జగన్‌ గెజిట్‌పత్రికైన సాక్షిలో ప్రచురించారన్నారు. ఒకతల్లికి ఒకబిడ్డ అనే నిబంధనప్రకారమే అమ్మఒడిని ప్రభుత్వం అమలుచేస్తోందని,   ఆవిధంగాచూసిన 42లక్షలమంది తల్లులకు, అంటే 42లక్షలమంది విద్యార్థులకే  పథకం వర్తించాలని, కానీ 82లక్షలపైబడి అని సాక్షిలో వేయడం ఎవర్ని మోసగించడా నికో స్పష్టంచేయాలన్నారు. సాక్షిలో తప్పులు రాస్తారని, ఇతరపత్రికలు చదవాలని అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి సూచించినందునే, తనవిషపత్రికలో ఈవిధమైన లెక్కలు వేయిసున్నాడా...లేక ప్రభుత్వం తప్పుడు లెక్కలు వేయించిందా అని నిమ్మల ప్రశ్నించారు. 

 


పాదయాత్రలో, ఎన్నికలప్రచారంలో, గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో గానీ తల్లులం దరూ వారిపిల్లల్ని బడికి పంపిస్తే, ఒక్కో పిల్లాడికి ఏటా రూ.15వేలుఇస్తానని, మీపిల్లలకు మేనమామలా ఉంటానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడెలా మాటతప్పాడన్నారు.  ఒకబిడ్డకే రూ.15వేలు ఇస్తున్న జగన్మోహన్‌రెడ్డి, మరోబిడ్డకు ఎవరు మేనమామగా ఉండాలో సమాధానం చెప్పాలని రామానాయుడు ఎద్దేవాచేశారు. సహజంగా చదువు విషయంలో తల్లిదండ్రులు మగపిల్లలకే ప్రాధాన్యత ఇస్తారని, తద్వారా జగన్‌ నిర్ణయం కారణంగా ఆడబిడ్డలకే ఎక్కువ అన్యాయం జరుగుతుందని నిమ్మల పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఉపయోగపడని విధంగా, జగన్‌సర్కారు అమ్మఒడి పథకాన్ని అరకొరగా అమలుచేస్తోందన్నారు. మాటతప్పను-మడమతిప్పను అని, మేనిఫెస్టో తమకు భగవద్గీ త, ఖురాన్‌, బైబిల్‌ అని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి మడమతిప్పడంలో కూచిపూడి నాట్యకారుడినే మించిపోయాడని, మేనిఫెస్టోను అమలుచేయకుండా పవిత్రగ్రంథాలను         అపవిత్రం చేసి, తనమాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నాడని నిమ్మల     ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: