నేడు దేశవ్యాప్త సమ్మె, రాష్ట్ర బంద్‌లో భాగంగా తెల్లవారుజామున కడప ఆర్టీసీ బస్టాండ్‌లో ఆందోళన చేపట్టిన వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. 

                 

వైసీపీ, టీడీపీలు పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతిస్తూ... రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ లో భాగంగా కడప జిల్లాలో వామపక్ష నేతలు బస్సులను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. 

                            

విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా ఇవాళ పలు రకాల సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. బ్యాంక్‌ యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.

 

కాగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటే తీవ్ర ఇబ్బందులు చూడాల్సి వస్తుంది అని మోదీ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. అయినప్పటికీ ఉద్యోగులు ఏ మాత్రం వినకుండా సమ్మె చేశారు. మరి వీరిపై మోదీ ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

 

అంతేకాదు... ఈ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొన్నారు. బ్యాంకులు పని చెయ్యక.. డిపాజిట్లు చెయ్యలేక.. ఏటీఎంలు పని చెయ్యక తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. కాగా ఎక్కడిక్కడ ఈ ఉద్రిక్తత పరిస్థులను ఎదురుకొన్నారు ప్రజలు.. మరో వైపు కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్థత పరిస్థితులు నెల కొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: