ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇరాన్ రాజధాని టెహ్రైన్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.  ఈ విమాన ప్రమాదంలో 169 మంది మరణించారు.  ఈ విమానం టేకాఫ్ అయినా కొద్దీ సేపటికి కూలిపోయింది.  అయితే ఎందుకు కూలిపోయింది.. ఎలా కూలిపోయింది అనే విషయాలు మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు.  సాంకేతిక కారణాల వలన మాత్రమే కూలిపోయిందని అంటున్నారు.  కానీ, కారణం అది కాదన్నది కొందరి వాదన.  


గతంలో ఇలానే బాలాకోట్ పై ఇండియా దాడి చేసిన తరువాత శత్రువుల విమానం అనుకోని సొంత విమానాన్ని కూల్చేసింది.  ఆ తరువాత జరిగిన తప్పు తెలుసుకొని నాలిక కరుచుకుంది.  ఇప్పుడు ఇరాన్ కూడా అలానే చేసిందా అనే డౌట్ వస్తోంది. దానికి సమాధానం దొరకాలి అంటే విమానంలోని బ్లాక్ బాక్స్ దొరకాలి.  ప్రస్తుతం అది ఇరాన్ దగ్గర ఉన్నది.  దీనిని తిరిగి ఇచ్చేందుకు ఇరాన్ ప్రభుత్వం సిద్ధంగా లేదు.  


ఇవ్వనంటే ఇవ్వను అంటోంది.  ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.  ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పైన ఇరాన్ దళాలు దాడులు చేశారు.  ఈ మిస్సైల్స్ దాడిలో దాదాపుగా 80 మంది అమెరికా ఉగ్రవాదులు మరణించారని ఇరాన్ అంటోంది.  సంఖ్య ఇంత అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా... భారీ నష్టం అయితే జరిగే ఉంటుంది.  


అయితే, దీనిపై అమెరికా మాత్రం ఎలాంటి స్పందనలు ఇవ్వడం లేదు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైలెంట్ గా ఉన్నారు. ఎంతమంది ఏంటి దానిని అమెరికా ఎలా స్పందించబోతుంది అన్నది ట్రంప్ అధికారికంగా చెప్పాల్సి ఉన్నది.  ఆల్ ఈజ్ వెల్ అని మాత్రమే ట్రంప్ చెప్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం యుద్ధం అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది.  యుద్ధం సంభవిస్తే ఎలా ఏంటి అనేది తెలియాల్సి ఉన్నది. అయితే, అంతర్జాతీయ సమాజం మాత్రం యుద్ధం వద్దనే అంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: