ఎక్కడైనా సరే.. జంతువులను బిడ్డల్లా చూసుకుంటారు కొందరు.. మరికొందరు వాటిని చంపడం అస్సలు చూడలేరు.. ఎంత మాంసాహారులైన సరే వాటిని చంపే సమయంలో చూడలేరు.. కానీ అక్కడ మాత్రం ఓకేసారి 10 వేల ఒంటెలను ఓకేసారి కాల్చి చంపేస్తారట.. ఆశ్చర్యం వేసినా ఇది నిజం. 

                                                  

వివరాల్లోకి వెళ్తే.. కార్చిచ్చు ఆస్ట్రేలియాని దహించి వేస్తున్న సంగతి విదితమే. ఆస్ట్రేలియాలో అగ్ర భాగం అంత మంటల్లోనే ఉంది. దీంతో ఆస్ట్రేలియాలో వేల ఎకరాల్లో పంటలు, లక్షల ఎకరాల్లో అడవులు, కోట్ల సంఖ్యలో అడవి జంతువులు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. ఈ కార్చిచ్చుతో ఆస్ట్రేలియా ప్రజలు అల్లాడిపోతున్నారు. 

                          

అక్కడ మంటలను అదుపు చెయ్యడానికి ఆ దేశం తీవ్రంగా శ్రమిస్తోంది.. అయినప్పటికీ ఎంతమాత్రం అగ్గి అదుపులోకి రావట్లేదు.. అంతేకాదు అక్కడి ప్రజలు తాగటానికి నీళ్లు లేక ప్రాణాలను విడుస్తున్నారు. అసలే నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఒంటెలు మరికొన్ని బాధలుతెచ్చిపెడుతున్నాయి. 

                           

ఉన్న నీరంతా ఒంటెలు ఏ తాగిస్తున్నాయి. దీంతో ప్రజలు తాగటానికి నీళ్లు కూడా కరువై పోయాయి. అందుకే దేశంలో 10 వేలకు పైగా ఒంటెలను చంపెయ్యాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. దాదాపు 10 వేలకు పైగా ఒంటెలను హెలికాప్టర్ల నుండి అత్యాధునిక తుపాకులతో చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఐదు రోజులపాటు వాటిని చంపేయనున్నారు. దీంతో ఈ వార్తపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: