జనవరి 9.. వైసీపీ సర్కారుకు ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు. జగన్ తన ఎన్నికల హామీల్లో భాగంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న రోజు. చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. దాదాపు 43 లక్షల మంది అర్హులకు ఆయన ఈ అమ్మఒడి సొమ్ములు ఖాతాలో వేయబోతున్నారు. ఇంట్లో పాఠశాలకు వెళ్తున్న బిడ్డ ఉంటే చాలు. ఆ అమ్మ ఖాతాలో ఇవాళ రూ. 15 వేలు పడిపోతాయి.

 

కాకపోతే.. ఈ అమ్మ కుటుంబం దారిద్య రేఖకు దిగువన ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉండి ఉండాలి. ఇప్పటికే ఈ పథకం లబ్దిదారులను గుర్తించడం జరిగింది. జగన్ పథకాన్ని ప్రారంభించగానే అకౌంట్లలో సొమ్ము పడిపోతుందట. ఈ పథకానికి నిధుల కొరత లేదంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్. ముందుగానే బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించినందువల్ల పథకానికి నిధుల కొరత లేదన్నారు.

 

జనవరి 9 నే జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గతంలో ఆయన జనవరి 9 నే పాదయాత్ర ముగించుకున్నారు. పాదయాత్ర ముగింపు రోజునే ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టడం మరో అపూర్వ ఘట్టం. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూపిన వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. నాడు నేను విన్నాను..నేను ఉన్నానని మాట ఇచ్చారు. అచ్చం అదే చేస్తున్నారు. అభాగ్యులకు అండగా ఉంటున్నారు.

 

సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసిన నాడు చెప్పారు.. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ప్రజల కోసం చేపడుతున్న ప్రతి పనిలోనూ తనకున్న క్లారీటీతో ముందుకుసాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో పాలనపరమైన అడుగులు వేస్తూ తనకంటూ ఒక కొత్త చరిత్రను సృష్టించుకుంటున్నారు సీఎం వైయస్‌ జగన్‌. ఈ ఏడు నెలల్లో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాదయాత్ర ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: