ప్రపంచం ఎటు పోతుంది అంటే దానికి అంతులేదు.  ఎటు వెళ్తుందో చెప్పడం చాలా కష్టం.  మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి.  మహిళ అయితే చాలు వాళ్ళు ఎలా ఉన్నారు.. ఏంటి అనే విషయాలు కూడా చూసుకోకుండా అత్యాచారాలు చేస్తున్నారు.  ఉద్రేకంతో రెచ్చిపోతున్నారు. ఈ ఉద్రేకంలో మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ... అవహేళనగా మాట్లాడిన సందర్భాలు చాలా చూశాం.  అయితే, మగవాళ్ల బుద్దులు ఎలా మారిపోతున్నాయో చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి.  


అందులో ఒకటి ఇది. ఇండోనేషియాకు చెందిన ఓ యువకుడు బ్రిటన్ లో చదువుకోవడానికి 2007 వ సంవత్సరంలో వెళ్ళాడు.  అలా అక్కడికి వెళ్లిన ఆ యువకుడు తన కామవాంఛను తీర్చుకోవడానికి తప్పుడు మార్గాలను ఎంచుకున్నాడు.  సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.  ఇందులో భాగంగానే మాంచెస్టర్ క్లబ్ ను ఎంచుకున్నాడు.  మాంచెస్టర్ క్లబ్ లో ఫుల్ గా తాగి రోడ్డుమీద పడే వ్యక్తులను తన ఇంటికి తీసుకెళ్లేవారు.  


అలా తన ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు.  అలా ఇచ్చిన తరువాత ఆ వ్యక్తిపై అత్యాచారం చేశాడు.  దాని మొత్తాన్ని తన మొబైల్ లో భద్రంగా దాచుకునేవాడు.  ఇలా నిత్యం చేస్తూనే ఉన్నాడు.  అయితే, ఎప్పటిలాగే ఈ యువకుడు మాంచెస్టర్ క్లబ్ దగ్గర ఫుల్ గా తాగి ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి రేప్ చేస్తుండగా సదరు వ్యక్తికి మెలుకువ వచ్చింది.  


తనపై జరుగుతున్న అత్యాచార ఘటన చూసి షాక్ అయ్యాడు.  వెంటనే ఆ వ్యక్తి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇండోనేషియా యువకుడిని అరెస్ట్ చేశారు.  అయితే, అతని మొబైల్ ను చెక్ చేయగా దాదాపుగా 190 మంది వ్యక్తుల వీడియోలు ఉన్నాయి.  దీంతో పోలీసులు షాక్ అయ్యారు.  ఇప్పటి వరకు దాదాపుగా 70 మందిని పోలీసులు గుర్తించారు.  ఇంకా చాలామందిని పోలీసులు గుర్తించాల్సి ఉన్నది.    

మరింత సమాచారం తెలుసుకోండి: