దీపికా పడుకోన్ కొత్త కష్టాన్ని కొని తెచ్చుకున్నట్లయింది . ఢిల్లీలోని జే ఎన్ యూ లో విద్యార్థులు ,ప్రొఫెసర్ల పై ముసుగు గుండాల దాడిని నిరసిస్తూ , మంగళవారం జే ఎన్ యూ ను సందర్శించిన విషయం తెల్సిందే .  జే ఎన్ యూ ను దీపిక సందర్శించడం పట్ల పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు . ప్రధానంగా బీజేపీ నేతలు , హిందూ సంస్థల నాయకులు, ఈ బాలీవుడ్ నటి వ్యవహారశైలి పై అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు . కేవలం ప్రచార్భటం కోసమే దీపిక ఇదంతా చేసిందని విరుచుకుపడుతున్నారు .

 

జే ఎన్ యూ ను దీపిక సందర్శించడాన్ని జీర్ణించుకోలేని వారు   తాజాగా దీపిక నటించిన ఛపాక్  చిత్రాన్నిబహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని చేపట్టారు . బ్యాన్ ఛపాక్   హాష్ ట్యాగ్ తో దీపిక ను విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ , ఆమె నటించిన చిత్రాన్ని బహిష్కరించాలని కోరుతున్నారు . కేవలం   తన సినిమా ప్రమోషన్ కోసమే దీపిక జే ఎన్ యూ ను సందర్శించడమే కాకుండా , దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తోందని వారు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కన్హయ్య కుమార్ , అయిషి ఘోష్ వంటి వారికి మద్దతు తెలిపిన దీపిక , ఏబీవీపీ కార్యకర్తలను ఎందుకు పరామర్శించలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు .

 

అయితే ఇప్పటి వరకు ఛపాక్   చిత్రం గురించి పెద్దగా ఎవరికీ తెలియదని , కేవలం బాలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి మాత్రమే  తెలుసునని , ఇప్పుడు ఆమె వ్యతిరేకుల ట్రోలింగ్ వల్ల  ఈ సినిమాకు పెద్ద ఎత్తున ఉచిత ప్రచారం లభించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు . యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితగాధ ఆధారంగా తెర కు ఎక్కిన ఛపాక్  చిత్రం బాక్స్ అఫీస్ వద్ద సక్సెస్ కావడం ఖాయమని దీపిక మద్దతుదారులు అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: